Horoscope Today, august 02, 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Aries horoscope
ఈ రాశి వారికి ఆటంకాలు ఎదురయిన సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణీకులు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన మరియు వ్యాపార రంగాలలో, ఏదైనా ఆర్థిక నష్టాలను నివారించడానికి జాగ్రత్త వహించడం మరియు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం వేచి చూస్తారు. రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్యబాధలుండవు. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండ జాగ్రత్తపడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Taurus horoscope
ఈరోజు ఈరాశి వారి గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి. బంధుమిత్రులని కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు.అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Gemini
ఈ రోజు కొత్త వస్తువులు, బట్టలు, వాహనాలు మరియు ఆభరణాల కొనుగోలుకు అవకాశం ఉంది . శుభవార్త మరియు శుభకార్యాలు సులభంగా నెరవేరే రోజు. బంధువులతో సామాజిక సమావేశాలు మరియు పండుగలను ఆనందించండి మరియు మీరు నిర్దేశించిన సమయంలో చేపట్టే అన్ని పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Cancer horoscope
వీరికి అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అకాశం ఉంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. సహనం అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Leo
ఈరోజు వీరు బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Virgo
ఈరోజు వీరు విందులు, వినోదాలకు దూరంగా ఉంటారు.. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. మానసిక ఆందోళన ఎక్కువ. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. తరుచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనంతో ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Libra horoscope
ఈరోజు వీరి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించగలుగుతారు.. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి . కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Scorpio
ఈరోజు, ఆకస్మిక ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువ. స్థిరాస్తి వ్యవహారాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన ఉంటుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోవల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులుండును. కొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులతో ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Saggitarius
ఈరోజు వీరికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల విమర్శలకు లోనవుతుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఎక్కువగాఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్నకార్యాలన్నింట్లో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Capricorn horoscope
ఈరోజు వీరికి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. రాజకీయరంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Aquarius
ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆత్మీయుల సహకారం కూడా లభిస్తుంది. ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు august 02, 2023 Pisces horoscope
ఈరోజు వీరికి కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది.. పేరు, ప్రతిష్టలు పెరుగడం వలన సంఘంలో మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభయోగం కూడా కలుగుతుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్య పరిస్థితిలో మార్పులుంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
also read :
Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?
Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!
Shivalingam : శివలింగం ఆకారం మెదడులోని ఈ భాగం వలె ఉంటుంది.. పనితీరు మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి