Homehoroscopehoroscope today in telugu : 01-08-2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu : 01-08-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, august 01, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Aries horoscope

ఈ రాశి గల వ్యక్తులు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సలహా. మానసిక దృఢత్వంతో పనులు చేపట్టడం ద్వారా ఖ్యాతి లభిస్తుంది. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నమ్మకంతో పనిచేస్తే విజయం త‌ప్ప‌క‌ లభిస్తుంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Taurus horoscope

ఈరోజు ఈ రాశివారు పనితీరుతో ప్రశంసలను పొంద‌గ‌లుగుతారు. వృత్తిపరమైన, ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలోని వ్యక్తులకు, సహాయక మరియు ప్రోత్సాహకరమైన వాతావరణంలో పని చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించండి. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Gemini

ఈ రోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు.. అధిక ధన వ్యయం చేస్తారు. అతిగా నమ్మడం అస్మంలు మంచిది కాదు. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. ఆవేశంలో ఏ నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.

horoscope today in telugu

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Cancer horoscope

ఈ రోజు, ఈ రాశి వ్యక్తులు ఇతరుల సహాయం మరియు మద్దతుతో ముందుకు సాగడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారు. కీలక వ్యవహారంలో దైర్యంగా ముందుకు అడుగు వేసి.. అందరి ప్రశంసలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

-Advertisement-

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Leo

ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా ఉంటారు.. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేసి.. ప్రతిభకు తగిన ప్రశంసలను ద‌క్కించుకుంటారు. ప్ర‌తి విష‌యంలో కాస్త ఓపిక‌గా ఉండాలి. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Virgo

ఈ రాశివారు ఈరోజు అనవసర ఆందోళనకు దూరంగా ఉండడం మంచిది మధ్యమ ఫలితాలను అందుకుంటారు. సమస్యలకు కుంగిపోకుండా ఉండడం నలుగురిని కలుపుకుని ముందుకు వెళితే మీకు చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టంపట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

today horoscope

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు శత్రువులపై త‌ప్ప‌క విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాల్సి అవ‌స‌రం ఎంతైన ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Scorpio

ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు ప‌య‌నిస్తారు. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధికారుల ప్రశంసలు త‌ప్ప‌క పొందుతారు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Saggitarius

ఈరోజు ఈ రాశి వారు మధ్యమ ఫలితాలను చేజిక్కించుకుంటారు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు. మానసిక ప్రశాంత కోసం దైవ దర్శనం చేసుకోవ‌డం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతివిషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

today horoscope

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారికి అధిక ధనలాభం క‌లుగుతుంది.. బంధు. మిత్రుల సహకారంతో ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలను పొంద‌గ‌లుగుతారు. శత్రువు మీద విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు వేస్తారు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Aquarius

ఈ రోజు ఈరాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్ల‌డం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు august 01, 2023 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు.. అనవరస వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. అనుకున్న పని త‌ప్ప‌క‌ నెరవేరుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకునే అవ‌కాశం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

– పంచాంగకర్త బ్రహ్మశ్రీ వెంకట శర్మ గారు

 

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News