HomedevotionalHoroscope (30-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (30-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 30th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (aries)

aries
aries

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వినే అవ‌కాశం ఉంది. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభించ‌డంతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు సేకరించే అవ‌కాశం ఉంది.

వృషభం(taurus)

taurus
taurus

ఈ రాశి వారికి శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది.. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందే ఛాన్స్ ఎక్కువ‌.. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది.

మిథునం(gemini)

gemini
gemini

ఈ రాశి వారికి కొన్నికార్యాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందే అవ‌కాశం ఉంది.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది.

కర్కాటకం(Cancer)

Cancer
Cancer

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ‌. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల కొంత బలహీనులవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతుంది.

సింహం(leo)

leo
leo

ఈ రాశి వారికి అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. మోసపోయే అవకాశాలు ఎక్క‌వుగా ఉంటాయి. ఆర్థికపరిస్థితి కొంత ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకుంగా ఉండ‌డం ఉత్త‌మం.

-Advertisement-

కన్య(virgo)

virgo
virgo

ఈ రాశి వారికి వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో కొంత సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం చేయండి. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ త‌ప్ప‌నిస‌రి. వివాదాల‌కు దూరంగా ఉంటే మంచిది.

తుల(libra)

libra
libra

ఈ రాశి వారి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల ఏ మాత్రం పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం చేయండి, అది మీకు మంచిది.

వృశ్చికం(Scorpio)

Scorpio
Scorpio

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకునే ప్ర‌య‌త్నాలు చేస్తారు. . ప్రతిచిన్న విషయంలో ఆటంకాలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వ‌హించాలి.

ధనుస్సు(Saggitarius)

Saggitarius
Saggitarius

ఈ రాశికి చెందిన వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులని ఎంతో గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందే అవ‌కాశం ఉంది.. సత్కార్యాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. గృహ అవసరాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు.

మకరం(Capricorn)

Capricorn
Capricorn

ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఎక్కువ‌గా ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకునే ఛాన్స్ ఉంది.. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది.

కుంభం(Aquarius)

Aquarius
Aquarius

ఈ రాశి వారికి ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఎక్కువ‌గా ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు క్ర‌మేపి లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది.

మీనం(Pisces)

Pisces
Pisces

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉంటాయి.. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉంది.. ఆత్మీయుల సహకారం కొంత ఆలస్యంగా లభిస్తుంది.

 

 

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News