HomedevotionalHoroscope today: 27-11-2022 ఆదివారం రాశి ఫ‌లాలు..

Horoscope today: 27-11-2022 ఆదివారం రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 27th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Aries horoscope

ఈ రాశి వారికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. అవసరానికి తగిన ఆర్థిక సహాయం పొందుతారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించేందుకు కొంత కష్టపడతారు. అనవసర ఖర్చులు పెరగ‌డం వ‌లన ఇబ్బందులు ప‌డ‌తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి..

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Taurus

ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం క‌లుగుతుంది.. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదుర‌య్యే ఛాన్స్ ఉంది.. స‌మ‌స్య‌లు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Gemini

ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై దృష్టిసారించడం మంచిది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Cancer horoscope

ఈ రాశి వారికి శుభకాలం ఉంటుంది.. చేపట్టిన పనుల గురించి శుభ‌వార్త‌లు వింటారు. అనుకూల పరిస్థితుల్లో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడిపే ఛాన్స్ ఉంది.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Leo

ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు. మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధించేందుకు ప్రయత్నాలు చేయ‌డం వ‌ల‌న త‌ప్ప‌క‌.. విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Virgo

ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధను కలిగించే అవకాశం ఉంటుందిది. ఆరోగ్యంపై త‌ప్ప‌క‌ శ్రద్ధ పెట్టడం మంచిది.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Libra horoscope

చేపట్టే పనుల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మనోబలంతో ముందుకు సాగితే అనుకున్నది త‌ప్ప‌క సాధిస్తారు. మ‌నం తీసుకునే నిర్ణయాలపై బంధుమిత్రులతో చర్చించండి. ప్రయాణాలు కొంత వాయిదా వేసుకుంటే మంచింది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Scorpio

ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడిపే అవ‌కాశం ఉంటుంది… కొంద‌రితో అప్రమత్తంగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Saggitarius

ఈ రాశివారికి అనుకూల పరిస్థితులు ఏర్ప‌డ‌తాయి.. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో విజయాలు సాధించే అవ‌కాశం ఉంటుంది.. శారీరక శ్రమ పెరిగే అవకాశముంది. కోపతాపాలకు దూరంగా ఉంటే మంచిది.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Capricorn horoscope

చేపట్టిన పనులను స‌మ‌యానికి పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం అవ‌స‌రం . ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.. అనవసర విషయాలకు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Aquarius

ఆటంకాలు ఎదురైనప్పటికీ.. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయ‌గ‌లుగుతారు.. వేరే వారి విషయాల్లో తలదూర్చకండి.. తీసుకునే నిర్ణయాలతో సమాజంలో మరింత గౌరవం పెరిగే అవ‌కాశం ఉంటుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 27, 2022 Pisces horoscope

ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు త్వ‌ర‌గా తీసుకుంటారు. ఈ సమయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. అనుకూలమైన ఫలితాలతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు త‌ప్ప‌క‌ అనుకూలిస్తాయి.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News