HomedevotionalHoroscope (21-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (21-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 21st april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశికి చెందిన వారు పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్త కూడా వింటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదర‌డంతో సంతోషంగా ఉంటారు.

వృషభం

ఈ రాశికి చెందిన వారి ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఖర్చులు మాత్రం తడిసి మోపెడు అవుతాయి. బంధువులకు ఆర్థికంగా ఎంతో సహాయపడతారు. వృత్తి వ్యాపారాలు కష్టాలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

మిథునం

ఈ రాశి వారి సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు త‌లెత్తుతాయి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పుణ్యకార్యాలలో పాల్గొనే అవ‌కాశం ఉంది.. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొనే ఛాన్స్ ఉంది.

కర్కాటకం

ఈ రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటి సమస్య ఒకటి బాగా ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది.. మీ వల్ల సహాయం పొందిన వారు ముఖం చాటేసే అవ‌కాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి నిలకడగా ఉంటుంది.

సింహం

ఈ రాశికి చెందిన వారికి అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. ఆశలు పెట్టుకున్న పెళ్లి సంబంధం వెనక్కి వెళ్ల‌డంతో సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జించే అవ‌కాశం ఉంది..

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశికి చెందిన వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ఒత్తిడి క్ర‌మంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుది.. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ‌

తుల

ఈ రాశికి చెందిన వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వచ్చే అవ‌కాశం ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఉన్నవారు అభివృద్ధి సాధించే అవ‌కాశం ఉంది.

వృశ్చికం

ఈ రాశికి చెందిన వారు గట్టిగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వృత్తిలో బాగా శ్రమ పడాల్సిన అవ‌స‌రం ఉంది.. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నిరుద్యోగులకు దూరప్రాంతంలో ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది.

ధనుస్సు

ఈ రాశి వారికి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. తలపెట్టిన పనులు పూర్తి చేసే ఛాన్స్ ఉంది.. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంది.స్నేహితులతో సరదాగా గడుపుతారు.

మకరం

ఈ రాశికి చెందిన వారు ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఎక్కువ‌గా ఉంది.. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు తీపి కబురు అందే ఛాన్స్ ఉంది.

కుంభం

ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో ఆచితూచి మాట్లాడ‌డం మంచిది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం క్ర‌మంగా పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశం ఉంది.

మీనం

ఈ రాశికి చెందిన వారు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ‌తారు. ఖర్చులు బాగా పెరిగినా, ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలు క్ర‌మంగా లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహితులు సహాయంగా ఉండే అవ‌కాశం ఉంది.

also read :

heatwave : దేశ వ్యాప్తంగా మండుతున్న ఎండలు.. కేంబ్రిడ్జ్‌ వర్సిటీ కీలక నివేదిక!

Viral Video : పాములు సంభోగంలో ఉండగా డిస్టర్బ్‌ చేసిన డేరింగ్‌ గర్ల్‌..!

YSR View Point : విశాఖలో వ్యూ పాయింట్‌ వివాదం.. అసలేం జరిగింది?

Keerthy Suresh: రిసార్ట్ ఓన‌ర్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. నిజమెంత ?

Anasuya: నీ కొడుకుల‌కి వంట నేర్పించు అంటూ అన‌సూయ‌కి కౌంట‌ర్.. ఎలా రెస్పాండ్ అయిందంటే..!

Ramzan : ఇస్లామీయులకు పవిత్రమైన రంజాన్ గురించి తెలుసుకోండి..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News