Horoscope Today, 19th january 2023: Check astrological prediction for your zodiac signs
మేష రాశి :
మేష రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలముగా ఉన్నది. జన్మస్థానమునందు రాహువు ద్వితీయ స్థానమునందు కుజుని ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది.
వృషభ రాశి :
వృషభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వృషభ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం పొందెదరు. వృషభరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించాలి
మిథున రాశి :
మిథున రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. సౌఖ్యమును పొందెదరు. మిథున రాశి వారికి ఈ రోజు ధన లాభము కలుగును. ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. మిథున రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితం ఉంటుంది.. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును.శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ రోజు కలిసి వచ్చును. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
సింహ రాశి :
సింహ రాశి వారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటిరోజు. సింహరాశి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దక్షిణామూర్తిని పూజించాలి..
కన్య రాశి :
కన్య రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉన్నది. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ వారం ఒత్తిళ్ళు తగ్గును. శత్రువులపైవిజయము పొందెదరు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది.
తులా రాశి :
తులారాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధిస్తుంది. స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
వృశ్చిక రాశి :
వృశ్చికరాశికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. జన్మరాశి యందు రవి, కళత్రమునందు కుజుడు, ప్రభావం చేత ఈ రాశి వారికి కుటుంబమునందు చికాకులు సమస్యలు, ఆరోగ్యమునందు సమస్యలు ఏర్పడును. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. వృశ్చిక రాశివారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని ఆరాధించండి.
ధనుస్సు రాశి :
ధనూ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ధనూ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించాలి.
మకర రాశి :
మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. ఖర్చులు అధికమగును. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. పనులయందు ఇబ్బందులు ఆటంకములు ఏర్పడును. కష్టపడాల్సినటువంటి సమయం. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
కుంభ రాశి :
కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్తమునుండి అనుకూల ఫలితాలున్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికి ఈ రోజు గోచార స్థితి వలన శు భఫలితాలు కనిపిస్తున్నాయి.. ఖర్చులు నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారములో ఉన్న సమస్యలు తొలగును. స్త్రీలకు ఈవారం అనుకూలంగా ఉంటుంది.. విద్యార్థులకు కలసి వచ్చును.
మీన రాశి :
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. కుటుంబమునందు సమస్యలు వేధించును. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలి. దశమ స్థానమునందు బుధ, శుక్రుల ప్రభావం చేత ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలసి వచ్చును. కీర్తి , సౌఖ్యము కలుగును.
also read:
Immunity Foods : రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్ తింటే తిరుగుండదు!
ICC: మ్యాచ్‌లు ఆడకుండానే టాప్ ర్యాంక్‌లో నిలిచిన టీమిండియా.. ఐసీసీకి నెటిజన్ల చురకలు
Viral video : రోడ్డుపై బైక్‌లో కపుల్ రొమాన్స్.. సోషల్ మీడియాలో వైరల్