Horoscope Today, 17th april 2023: Check astrological prediction for your zodiac signs
మేష రాశి :
ఈ రాశి వారికి ఆర్థిక లాభము, శుభ ఫలితములు కలుగుచున్నవి. కుటుంబానికి స్నేహితులకు ధనసహాయము, దానధర్మములు చేసే అవకాశం ఉంది.. నూతనంగా వస్తువులు కొనడానికి ధనాన్ని ఎంతో ఖర్చు చేసెదరు. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు చేసే అవకాశం ఉంది.
వృషభ రాశి :
ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలించును. గృహమునందు శుభ కార్యములు జరుగుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది . స్త్రీలకు ఒత్తిళ్ళు అధికముగా ఉండే అవకాశం ఉంది.
మిథున రాశి :
ఈ రాశి వారికి వ్యయ స్థానమునందు గురు, శుక్రుల సంచారము చేత ఖర్చులు అధికముగా ఉంటాయి. సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించే అవకాశం ఉంది.. మిథున రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించడం మంచిది.
కర్కాటక రాశి :
ఈ రాశి వారు ఆరోగ్య విషయాలయందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. తెలివితేటలతో అనేక సమస్యలను అధిగమించెదరు. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సిన సమయము ఇది .
సింహ రాశి :
ఈ రాశి వారికి కుటుంబము నందు చికాకులు, సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. కుటుంబ విషయాల యందు, ఆర్థిక వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడుతాయి
కన్య రాశి :
ఈ రాశి వారికి సమాజంలో కీర్తి, శత్రువులపై విజయము కలుగును. కుటుంబ సౌఖ్యము, శారీరక సౌఖ్యము మరియు మానసిక సౌఖ్యము కూడా పొందెదరు. గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును.
తులా రాశి :
ఈ రాశి వారికి చేసే పనుల యందు అనుకూలమైన ఫలితాలు పొందెదరు. శత్రు వర్గము వలన ఇబ్బందులు, కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి.. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. . శారీరక శ్రమ అధికముగా ఉండును. వీరు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేస్తారు..
ధనుస్సు రాశి :
ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. చేసే పనులయందు విజయము పొందే అవకాశం ఉంది.. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ఈ రాశి వారు వివాదాలకి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
మకర రాశి :
ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు పెరుగును. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.. బంధుమిత్రులతో, సోదరులతో భేదాభిప్రాయములు కలుగుతుంది. మొండితనముతో పట్టుదలతో అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు ధనపరమైన విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశం ఉంది.
కుంభ రాశి :
ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు, వేదనలు, సమస్యలు అధికముగా ఉండును. వీరి తెలివి తేటలతో ఆర్ధిక సమస్యల నుండి ఒత్తిళ్ళనుండి బయటపడెదరు. చేసే పనులు అనుకూలించి సత్ఫలితాలు ఇచ్చును. గత కొంతకాలముతో పోల్చుకుంటే కుంభరాశి వారు అనేక సమస్యల నుండి బయట పడేటటువంటి ప్రయత్నములో విజయాన్ని సాధిస్తారు.
మీన రాశి :
ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికముగా ఉంటుంది.. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగములో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటుంది.
also read :
Sukumar : సుకుమార్ భార్యకి వింత కోరిక.. అదేంటో తెలిస్తే మీరు అవాక్కవుతారు..!
Mahesh babu: మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ ఇదే.. అందం కోసం విదేశాలలో…!
Arjun Tendulkar: ఎట్టకేలకు సచిన్ తనయుడి అరంగేట్రం.. బౌలింగ్‌లో ముద్ర వేస్తాడా?
Japan PM: జపాన్ రాజకీయాల్లో కలవరం.. ప్రధానిపై బాంబు దాడి..
Kejriwal: దేశం కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం.. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిందన్న కేజ్రీవాల్
Rakesh-Sujatha : ఏంటి.. అప్పుడే రాకింగ్ రాకేష్, సుజాతల మధ్య గొడవలా..!