HomedevotionalHoroscope Today: 12-10-2022 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి బేదాభిప్రాయాలు క‌లుగుతాయి...!

Horoscope Today: 12-10-2022 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి బేదాభిప్రాయాలు క‌లుగుతాయి…!

Telugu Flash News

Horoscope Today:

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండ‌దు. శారీరక, మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. గొడవలకు దూరంగా ఉండటం వ‌ల‌న కొంత ప్ర‌శాంతంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయాల్సి ఉంటుంది.

వృషభ రాశి

ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు వ‌స్తాయి. మీరు కొత్త వ‌స్తువులు కొనుగోలు చేయడానికి ప్ర‌య‌త్నిస్తారు.

మిధున రాశి

-Advertisement-

ఈరోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబంలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవ‌కాశం ఉంది. ప్రయాణములో ఖర్చులు ఎక్కువ అయ్యే అవ‌కాశం ఉంది.

కర్కాటక రాశి

ఈరోజు డబ్బులు అధికముగా ఖర్చు చేస్తారు. చేసే ప్రతి పని మీకు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహముతో ముందుకు వెళ్ల‌డం వ‌ల‌న కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం శ్రేయ‌స్క‌రం.

సింహ రాశి

ఈరోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎక్కువ క‌లుగుతాయి.. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయండి

కన్యా రాశి

ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు కావ‌డం వ‌ల‌న కాస్త ఇబ్బంది ప‌డుతుంటారు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించండి.

తులా రాశి

ఈరోజు ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము పొందుతారు. అప్పుల ఒత్తిడి ఎక్కువ ఉండ‌డం వ‌ల‌న మాన‌సిక ఆందోళ చెందుతారు. ఆ స‌మ‌యంలో మిత్రులు హెల్ప్ చేస్తారు.

horoscope today

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు ఉద్యోగ‌ములో ఒత్తిడి ఉంటుంది. శ‌త్రువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది.

ధనుస్సు రాశి

ఈరోజు మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి, అలానే గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఎక్కువ‌గా ఉంటాయి.

మకర రాశి

ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువ అవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వ‌ల‌న ప్రతి పనిని ఆచితూచీ చేయడం మంచిది.

కుంభ రాశి

ఈరోజు కుటుంబంలోని వారితో ఆచితూచి వ్యవహరించండి. శత్రువుల బాధలు ఎక్కువ అవుతాయి. ఉద్యోగములో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోండి, అలానే శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయాల్సి ఉంటుంది.

మీన రాశి

ఈరోజు మీకు కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శారీరక శ్రమతో పాటు ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News