HomedevotionalHoroscope (08-05-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (08-05-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 8th may 2023: Check astrological prediction for your zodiac signs

మేష రాశి :

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమగును. ఈ రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

వృషభ రాశి :

ఈ రాశి వారు గొడవలు, వాగ్వివివాదములకు దూరంగా ఉండాలి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉండ‌డం ఉత్త‌మం. వృషభరాశి వారికి ఆర్ధిక‌పరంగా లాభం చేకూరును.

మిథున రాశి :

ఈ రాశి వారికి మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించ‌డం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. కుజుని ప్రభావం చేత ఒత్తిళ్ళు అధికముగా ఉంట‌యి.

కర్కాటక రాశి :

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించ‌డం ఉత్తమం. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, మరియు శివాభిషేకం చేసుకోవడం వలన ఫ‌లితం ఉంటుంది.

సింహరాశి :

ఈ రాశి వారికి పనులయందు శ్రమ మరియు చికాకులు అధికమగును. ఆర్థిక విషయాలు కొంత‌ ఇబ్బంది పెట్టును. సింహరాశి ఉద్యోగస్తులకు అనుకూలము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడుచున్నవి. విద్యార్థులు జాగ్రత్త వహించవలసినటువంటి సమయముగా చెప్పాలి.

-Advertisement-

horoscope today teluguకన్య రాశి :

ఈ రాశి వారు అనుకున్న ప్రతీ పనియందు విజయాన్ని చూచెదరు. గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగుతుంది..

తులా రాశి :

ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించ వ‌లసి ఉంటుంది.. ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైన సమయము.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించ‌డం మంచిది. శని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగుతాయి.

ధనుస్సు రాశి :

ఈ రాశి వారికి ప్రయాణములు అనుకూలించును. ధనూరాశి వారికి శని అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము ద‌క్కుతుంది.. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉంటారు. కొన్ని విష‌యాల‌లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

మకర రాశి :

ఈ రాశి వారికి సమస్యలు, వివాదాలు, మానసిక ఘర్షణలు అధికమగును. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించ‌డం ఉత్త‌మం. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాల‌యంలో పూజ‌లు చేయాలి.

కుంభ రాశి :

ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాలయందు చికాకులు కలుగును. వాగ్వివిదాలకు దూరంగా ఉండ‌డం మంచిది. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును. ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో విభూతితో శివునికి అభిషేకం చేసుకోవ‌డం ఉత్తమం.

మీన రాశి :

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు అధికమగును. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు చెడు సమయముగా చెప్పుకోవాలి.. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉంటాయి.

also read :

IPL 2023: చల్లారిన వివాదం.. దాదాతో చేతులు కలిపిన విరాట్‌ కోహ్లీ

Cyclone Mocha: తెలంగాణకు మోచా తుపాన్‌ ఎఫెక్ట్‌.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

Ponniyin selvan2 : పొన్నియన్ సెల్వన్ 2 సింగ‌ర్ కి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. గీతా మాధురి రియాక్ష‌న్ ఏంటంటే..!

Amit Shah : బీజేపీ శ్రేణులపై అమిత్‌ షా ఆగ్రహం.. బైకులు తప్ప జనాలెక్కడ?

Ram Charan: క్రికెట్ టీమ్ కొన‌బోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. పూర్తి క్లారిటీ ఇదే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News