Telugu Flash News

Horoscope (08-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope april 8

Horoscope Today, 8th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. రాజ‌కీయ‌రంగంలోనివారికి, క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భించే అవకాశం ఎక్కువ‌. అన్నింటా విజ‌యాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు క‌లిసి సంతోషంగా గడుపుతారు.. శుభ‌వార్త‌లు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది.

వృష‌భం

ఈ రాశి వారు శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు ఎక్కువ‌గా వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో స‌ఫ‌లీకృతం చెందుతారు.. కీర్తి ప్ర‌తిష్ట‌లు కూడా అధిక‌మ‌వుతాయి.

మిథునం

ఈ రాశి వారికి ‌కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతోఎంతో ఆనందాన్ని పొందుతారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసే కార్యాల్లో చాలా నిమ‌గ్నుల‌వుతారు. స్త్రీల మూల‌కంగా లాభంగా ఉంటుంది. పేరు, ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. రుణ‌బాధ‌లు కూడా తొల‌గిపోతాయి.

క‌ర్కాట‌కం

ఈ రాశి వారికి శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉండే అవ‌కాశం ఉంది.. ఇత‌రుల‌కు ఉప‌క‌రించే ప‌నులు కొన్ని చేప‌డుతారు. గౌర‌వ‌మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వినే ఛాన్స్ ఉంది

సింహం

ఈ రాశి వారు కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. గృహంలో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. త‌ల‌చిన కార్యాలు ఆలస్యంగా నెర‌వేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా త‌ర్వాత‌కి వాయిదా వేసుకుంటారు.

క‌న్య‌

ఈ రాశ‌ఙ వారికి ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల‌ ప్ర‌తిభకు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చ‌ర్చ‌లు, స‌ద‌స్సులు మిన‌ల్ని ఎంతో ఆక‌ర్షిస్తాయి. మ‌నోధైర్యాన్ని క‌లిగి ఉంటారు. శుభ‌వార్త‌లుకూడా వింటారు.

తుల‌

ఈ రాశి వారికి మానసిక ఆందోళ‌న తొల‌గిపోతుంది. ఆరోగ్యం గురించి చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం క్ర‌మంగా దూర‌మ‌వుతుంది. ప్ర‌యాణాల్లో మెల‌కువ పాటించ‌డం అవ‌స‌రం. ప్ర‌య‌త్న‌కార్యాల్లో కొంత ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

వృశ్చికం

ఈ రాశి వారికి కుటుంబంలో క‌ల‌హాలు ఏర్పడే అవ‌కాశం ఉంటుంది. అశుభ‌వార్త‌లు ఎక్కువ‌గా వినాల్సి వ‌స్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు.

ధ‌నుస్సు

ఈ రాశి వారికి ప‌లు విష‌యాల‌లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. వృథా ప్ర‌యాణాల‌వ‌ల్ల కొంత అల‌స‌ట చెందుతారు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం ఉత్త‌మం.. అంద‌రితో స్నేహంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వ‌ల్పంగా ఎదుర‌వుతాయి.

మ‌క‌రం

ఈ రాశ‌ఙ వారు కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌కూడ‌దు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం ఉత్త‌మం.. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లోని వారికి కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పాటించాలి.

కుంభం

ఈ రాశి వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. ‌కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగానే ఉంటుంది. బంధు, మిత్రుల‌ను క‌లవ‌డం, పేరు, ప్ర‌తిష్ట‌లు సంపాదించ‌డం జ‌రుగుతుంది. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాల‌ను కూడా పొందుతారు.

మీనం

ఈ రాశి వారికి కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు త‌లెత్తుతాయి. ప్ర‌తి విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం మంచింది.

also read :

Chiranjeevi: ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో త‌దుప‌రి సినిమా చేయ‌నున్న‌ చిరంజీవి

Priyanka Chopra: త‌న అంద‌మైన కూతురిని చూపించి ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుష్ చేసిన ప్రియాంక చోప్రా

Mrunal Thakur sets the internet on fire with her beach pictures

Tamanna Latest Photos, Stills, instagram pics 2023

Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌

Exit mobile version