Horoscope Today, 8th february 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Aries horoscope
ఈ రాశి వారు ఆర్థికంగా కొద్ది కొద్దిగా పురోగతి చెందుతారు. తొందరపడి నిర్ణయాలు మార్చుకోవద్దు. ఉద్యోగంలో లక్ష్యాలు పెరుగుతాయి. అధికారులు మీ మీద అతిగా ఆధారపడటం జరుగుతుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఆనందంగా ఉంటారు.. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Taurus horoscope
ఈ రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు ఏర్పడతాయి.. రోహిణి నక్షత్రం వారు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. వ్యాపార రంగంలోని వారు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువ.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Gemini
ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కొందరు సన్నిహితులకు అండగా నిలబడతారు. ఉద్యోగంలో అనుకోకుండా మేలు జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోతారు. ఇతరుల ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Cancer horoscope
ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. కొద్దిగా ప్రయత్నిస్తే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. వ్యాపారంలో లాభాలు పెరగడానికి అవకాశం ఉంది. ఐటీ రంగంలోని వారు మంచి ఆఫర్లు పొందుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Leo
ఈ రాశి వారు వ్యక్తిగత పనులను వాయిదా వేయటం మంచిది కాదు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.. కొన్ని కుటుంబ విషయాలు చికాకు పెడతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవు తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Virgo
ఈ రాశి వారు అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయటం అవసరం. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే ఛాన్స్ ఉంది..
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Libra horoscope
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడే అవకాశం ఉంది.. వివాదాలకు దూరంగా ఉండండి. మీ మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. స్వాతి నక్షత్రం వారు లబ్ధి పొందగలుగుతారు..
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Scorpio
ఈ రాశి వారికి వాగ్దానాలు చేయటానికి, హామీలు ఉండటానికి ఇది సమయం కాదు. జేష్ట నక్షత్రం వారికి కలిసి వస్తుంది. వారి మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఉద్యోగం మారటం కొంచెం కష్టం అయ్యే ఛాన్స్ ఉంది.. ఉద్యోగంలో బాధ్యతలు మార్పు చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Saggitarius
ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉంది.. పూర్వాషాడ వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Capricorn horoscope
ఈ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడతారు. కొందరు స్నేహితులకు దూరంగా ఉండటం అవసరం.. బంధువుల కారణంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉచిత సేవలకు, అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Aquarius
ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొంతమంది మిత్రులు మీ పురోభివృద్ధికి సహాయపడతారు. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిది. ఉద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండటం వారికి చాలా మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 8, 2023 Pisces horoscope
ఈ రాశి వారు కొత్త ప్రయత్నాలు చేస్తారు.. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులు ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందుతారు. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం కొద్దిగా పరవాలేదు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురైనా లక్ష్యాలు పూర్తి చేసే అవకాశం ఉంది.
also read :
Varsha : కెరీర్ మొదట్లో వర్షని కూడా అంతగా ఇబ్బంది పెట్టారా..!
IND vs AUS : టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..
Viral Video : టర్కీలో భూకంపం వచ్చే ముందు పక్షుల అరుపులు చూశారా?
Kim Jong Un: 40 రోజుల నుంచి కనిపించని కిమ్.. ఉత్తరకొరియా అధినేతకు ఏమైంది?
victoria gowri : జస్టిస్ LCV గౌరి నియామకంపై దుమారం.. ఎందుకు ?