HomedevotionalHoroscope Today: 07-12-2022 బుధవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Horoscope Today: 07-12-2022 బుధవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 7th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Aries horoscope

ఈ రాశివారికి నేడు మంచి సమయంగా చెప్పాలి. నూతన కార్యాలకు శ్రీకారం చేప‌డ‌తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి ఎక్కువ‌గా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది. గొప్ప వ్యక్తుల‌ని కలుస్తారు. ఇంతవరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Taurus

ఈ రాశి వారు కాస్త ఆచుతూచీ వ్యవహరించటం ఎంతైన అస‌వ‌రం. కుటుంబంలో అనారోగ్య బాధలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా చాలా జాగ్రత్త పడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొవ‌డంతో పాటు, మ‌నం చేసే పనులలో కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతాయి.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Gemini

ఈ రాశివారికి కుటుంబ పరస్థితులు అంతా సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రులతో కలహం పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Cancer horoscope

కర్కాటక రాశి వారు కుటుంబ విషయాలపై ఎక్కువ అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు కొంత‌ ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంటుంది.

horoscope

-Advertisement-

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Leo

సింహ రాశి వారి కుటుంబంలో సుఖ, సంతోషాలు ఎక్కువ‌గా ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి క‌లుగుతుంది. విద్యార్థులు విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలు బాగానే ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు చాలా సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి ఉంటారు ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి.

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Virgo

కన్య రాశివారి మానసిక ఆందోళన కొంత‌ తొలగుతుంది. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువలు పాటించాల్సిన‌ అవసరం ఎంతైన ఉంది.. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు చాలా ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Libra horoscope

ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలకు కొంత‌ అనుకూలంగా ఉంటుంది. రుణలాభం కూడా పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఎక్క‌వ‌ ఆటంకాలు ఉంటాయి. స్థానచలనం ఏర్పడే అవకాశాలు చాలానే ఉంటాయి.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Scorpio

వృశ్చిక రాశివారికి సంపూర్ణ ఆరోగ్యం క‌లుగుతుంది.. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందే ఛాన్స్ ఉంటుంది. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలనుత్వ‌ర‌గా గ్రహిస్తారు. కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ స‌కాలంలో పూర్తిచేసుకుంటారు.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Saggitarius

ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధననష్టం ఏర్పడే ఛాన్స్ ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురు కావ‌డం, విదేశయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకుండి ఉండాలి.. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Capricorn horoscope

మకర రాశి వారు ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉండే అవ‌కాశం ఉంది.. ప్ర‌తి ఒక్క‌రు శుభవార్తలు వింటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులుగా ఉంటారు.. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లోను ఆస‌క్తిగా పాల్గొంటారు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Aquarius

కుంభ రాశివారు అన్నింటా విజయాన్నే పొందుతారు. బంధు, మిత్రులని కలుస్తారు. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వ‌స్తాయి.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 7, 2022 Pisces horoscope

మీన రాశివారు ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు పడటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి చాలా ఆల‌స్యంగా ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువే.

also read news:

‘కాంతారా’ సినిమా చూసిన అనసూయ రిషబ్‌ శెట్టి గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌తో ఏం చెప్పిందంటే ?

Litton Das: హిందువ‌ని అవ‌మానించారు.. ఇప్పుడు ఆ జ‌ట్టు త‌ల‌రాత మార్చ‌బోయేది ఇత‌నే…!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News