HomedevotionalHoroscope Today Telugu : 03-05-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు..

Horoscope Today Telugu : 03-05-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today: ఈ రోజు మే 3, 2023 బుధవారం .. మీ రాశి ఫలాలు తెలుసుకోండి..

మేషం

ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం ఉత్త‌మం. ఏ విష‌యంలోను అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌రాదు.

వృషభం

ఈ రాశి వారి కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. ప్రతివిషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.

మిథునం

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలిసి సంతోషంగా గ‌డుపుతారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకునే అవ‌కాశం ఉంది. అన్నింటా విజ‌యాలు సాధిస్తారు.

కర్కాటకం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేసే అవ‌కాశం ఉంది.. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు క్రమంగా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం

ఈ రాశి వారు కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందే ఛాన్స్ ఉంది.. ప్ర‌యత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు.

-Advertisement-

క‌న్య

ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు క్ర‌మంగా పూర్తవుతాయి. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభించే అవ‌కాశం ఉంది.

తుల‌

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ‌గా ఉంది. పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి క్ర‌మంగా ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పాటించాల్సి ఉంటుంది.

horoscope today teluguవృశ్చికం

ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం చేయాల్సి ఉంటుంది.. శారీరక అనారోగ్యంతో కొంత బాధపడుతారు. కుటుంబ విషయాలు అంత సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.

ధ‌నుస్సు

ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో కొంత‌ ఇబ్బంది పడతారు. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే ఛాన్స్ ఉంది.. ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండవు.

మకరం

ఈ రాశి వారకి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో కొంత‌ మార్పును కోరుకుంటారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం ఉత్త‌మం

కుంభం

ఈ రాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల కొంత లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి

మీనం

ఈ రాశి వారు మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను క్ర‌మేపి కొనుగోలు చేస్తారు.

also read news :

Water : వాటర్‌ బాటిల్‌ కాస్ట్‌ రూ.50 లక్షలు.. ఏమిటంత ప్రత్యేకత?

Viral Video : కదులుతున్న ట్రక్కు నుంచి మేకల దొంగతనం.. తర్వాత ఏమైందంటే..

Andhra Pradesh : బాలినేనికి సీఎం పిలుపు.. బుజ్జగింపులు కొనసాగుతాయా? మందలిస్తారా?

TS EAMCET : ఎంసెట్‌కు సర్వం సిద్ధం.. అదనంగా 50 వేలకుపైగా దరఖాస్తులు

Samantha: టార్చ‌ర్ టైం అంటున్న సమంత‌.. ఐస్ గడ్డల తొట్టెలో అలా కూర్చుందేంటి..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News