Homedevotionalhoroscope today telugu: 02-01-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today telugu: 02-01-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 2nd january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Aries horoscope

ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో కూడా విశేషంగా లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన పని అయితే పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి చాలా ఇబ్బంది పెడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Taurus horoscope

ఈ రాశికి చెందిన నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారులు ఎంతో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగానే సాగుతూ ఉంటుంది.. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండ‌డ‌మే కాక ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించండి.

మిథునం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Gemini

ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధించ‌డం చేస్తారు. వ్యాపారులకు అన్ని విధాలుగాను లాభసాటిగా ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కర్కాటకం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Cancer horoscope

ఈ రాశి వారు ఆదాయం పెంచుకోవడానికి గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసులోని కోరిక ఒకటి త‌ప్ప‌క‌ నెరవేరుతుంది. అనవసర ఖర్చులు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది.

సింహం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Leo

ఈ రాశి వారు విధి నిర్వహణలో ఆచితూచి అడుగు వేయాలి. కొద్దిగా మానసిక ఆందోళన క‌లుగుతుంది.. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవ‌స‌రం. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవ‌కాశం ఉంది

-Advertisement-

horoscopeకన్య – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Virgo

ఈ రాశి వారు ఉద్యోగంలో ఈ ప్రతిభ పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం ఏర్ప‌డుతుంది.. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న పని ఒకటి అనుకోకుండా పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి పొందుతారు.

తుల – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Libra horoscope

ఈ రాశి వారు ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులు ఆదరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనవసర ఖర్చులను అదుపు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైన‌ ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇల్లు మారాల్సిన పరిస్థితి కూడా ఏర్ప‌డే ఛాన్స్ ఉంది.

వృశ్చికం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Scorpio

ఈ రాశి వారు ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా చాలా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా లేదు. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగానే ఉంటుంది.

ధనస్సు – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Saggitarius

ఈ రాశి వారు ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ ఊహించని ఖర్చులతో కొంత‌ ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేసే అవ‌కాశం ఉంది.

మకరం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Capricorn horoscope

ఈ రాశి వారు మనసులో చాలా కాలం నుంచి ఉన్న కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదు. ఆదాయం గురించి ఒక శుభవార్త విన‌గ‌లుగుతారు.. ఉద్యోగంలో కొంత జాగ్రత్త అవసరం. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది.

కుంభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Aquarius

ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలిస్తుంది. వ్యాపారం ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయపడతారు. ఉద్యోగంలో అనుకూల కాలం నడుస్తోంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రయత్నాలు కొంత‌ సఫలం అవుతాయి. వృత్తి నిపుణులు కొద్దిగా శ్రమ పడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

మీనం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 02, Pisces horoscope

ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కొద్దిగా ప్రతికూలత కనిపిస్తోంది. అధికారులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత ఉన్నా రాణిస్తారు.

మరిన్ని వార్తలు చదవండి :

Rishabh Pant : కోలుకున్న పంత్.. కారు ప్ర‌మాదానికి ఇది అస‌లు కార‌ణం అని చెప్పిన రిష‌బ్

NTR: ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ నా కాళ్లు ప‌ట్టుకున్నాడు అని చెప్పిన సీనియ‌ర్ న‌టి

happy healthy new year 2023 : కొత్త ఏడాదిలో సరికొత్తగా ప్రయాణించాలా? ఈ నిర్ణయాలు తీసుకోండి!

New Year Resolutions 2023 : ఆనందం కలిగించే రిజల్యూషన్స్..ఈ మూడు సులభమైన సూచనలను పాటించండి

Chris Gayle: కుంబ్లేపై క్రిస్ గేల్ సంచ‌ల‌న కామెంట్స్… ఆయ‌న వ‌ల్ల‌నే నేను ఇలా….!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News