Horoscope Today, 6th june 2023: Check astrological prediction for your zodiac signs
మేష రాశి
ఈ రోజు మీకు ఇష్టమైన ఆట ఏదైనా ఆడండి . మీరు యవ్వనంగా ఉండేందుకు రోజు వాకింగ్ కి వెళ్ళండి. ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చే పని చేయండి. మీ సంపాదన పెరుగుతుంది.
ఈ రోజు మీ ఇంటికి చుట్టాలు వస్తారు. కూల్ డ్రింక్స్, స్వీట్స్ తెచ్చి మర్యాద చేయండి. ఇలా చేయడం వల్ల మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఈరోజు మీ ఆఫీసు లో మీరు చేసే పనులకు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ పనితనం నచ్చి మీకు ప్రమోషన్ కూడా ఇవ్వవచ్చు..మీ సలహాలు కూడా కోరతారు. ఈ రోజు మీ వర్క్ తొందరగా ఫినిష్ చేయండి. ఇంటి దగ్గర మీ ఆవిడ ఎదురుచూస్తుందని మరచిపోవద్దు. సినిమా ప్లాన్ వేసే ఉంటారు కదా.. ప్రమోషన్ వచ్చినందుకు పార్టీ చేసుకోండి.
వృషభ రాశి
ఈ రోజు ప్రెగ్నెంట్ లేడీస్ వాకింగ్ చేసేటప్పుడు కేర్ తీసుకోండి. మీకు ఆర్థికంగా లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. స్నేహితులు, బంధువులు, మీకు సహాయం చేయడానికి రెఢీ గా ఉంటారు. మీరు ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. మీకు ఇష్టమైన వ్యక్తి తో ఈ రోజు కూల్ గా మాట్లాడండి.లేకపోతే తరువాత మీరే హర్ట్ అవుతారు. మీ సీనియర్ల తో పార్టీ చేసుకోవడానికి ఈ రోజు మంచి రోజు కాదు. మీకు పెళ్లి అయి పిల్లలు ఉన్నట్లయితే సరదాగా వారిని బయటికి తీసుకు వెళ్ళండి. ఈ సమ్మర్ లో మీ ఇంటి దగ్గరలో ఎక్సిబిషన్ ఉంటే వెళ్ళండి. జాయింట్ వీల్ లో మీ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే వారి కేరింతలతో మీరూ ఎంజాయ్ చేయండి.
మిథున రాశి
ఈ రోజు జీవితంపట్ల ఓ మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకోండి. మీజీవన శైలి లో మార్పులు చేయండి. హాయిగా, ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించండి. దేని గురించి నిరాశ చెందవద్దు. మీ నెగెటివ్ ఆలోచన తో జీవిత మాధుర్యాన్ని మిస్ కావద్దు. మీకు డబ్బు విలువ బాగా తెలిసే ఉంటుంది .ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి కష్టం వచ్చినపుడు ఉపయోగపడుతుంది. పిల్లలకు , కుటుంబానికి ప్రాధాన్యతనివ్వండి. ఈ రోజు మీరు వెళ్ళే పార్టీ లో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అపుడప్పుడు ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.
కర్కాటక రాశి
ఈ రోజు అనారోగ్యం నుండి మీరు కోలుకుంటారు. మళ్ళీ మీరు మునపటిలా చురుకుగా , హ్యాపీ గా ఉండండి. పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను,లాభాలను పొందుతారు.
మీ పిల్లల్లో ఒకరికి ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. వారు మీరు ఆశించినట్టుగానే ఎదిగి, మీకలలను నిజం చేస్తారు. మీ ప్రియమైన వారికి మీ అందమైన ప్రపంచాన్ని పరిచయం చేయండి. మీ సహ ఉద్యోగులు మీకు సహాయం అందించడానికి ముందుకు వస్తారు. మీ ఖాళీసమయాన్ని సద్వినియోగము చేసుకోండి. మీ ఆవిడ మీకు అద్భుతమైన సర్ ప్రైజ్ ఇస్తుంది. ఆఫీస్ నుండి తొందరగా ఇంటికి వెళ్ళండి.
సింహ రాశి
ఈ రోజు మీఆరోగ్యం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మీ స్నేహితులతో ఆడుకోండి. డబ్బు సంబంధమైన సమస్య తో మీరు సతమతమవుతుంటారు . మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం ఆపండి. అన్నీ అవే సర్దుకుంటాయి. ఈ రోజు ఒక శుభవార్త వింటారు. అది మీ కుటుంబాన్నంతటికి ఆనందాన్నిస్తుంది. మీ ఆతృతను అదుపులో ఉంచుకొండి. మీరు మీ ప్రేయసికి దూరంగా ఉంటున్నారా ,బాగా గుర్తొస్తున్నారా.. ఈ రోజు హాయిగా ఫోనులో మాట్లాడుకోండి. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. మీరు ఈ రోజు మీ ఆవిడ పై కోపం వచ్చి ఎవరికి చెప్పకుండా ఒంటరిగా గడపటానికి ఇంటినుండి బయటకు వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మీ ఆవిడ అలక తీరుస్తారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు డబ్బు విలువ బాగా తెలుస్తుంది. డబ్బు ఆదా చేయడం నేర్చుకోండి..రేపటి రోజున అది మీకు బాగా ఉపయోగపడుతుంది. చదువు పై దృష్టి పెట్టండి. మీ చదువులను పక్కకి పెట్టి ఎక్కువగా ఆటలు ఆడి మీ తల్లిదండ్రులు బాధపెట్టకండి. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాముఖ్యత ఇవ్వండి . మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలన్స్ చేయడం ఉత్తమం. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మీభాగస్వామి మీతో కలసి సమయాన్నిగడపాలనుకుంటారు.కానీ మీరు వారి కోర్కెలను తీర్చలేరు.దీంతో వారు బాధపడుతారు. మీ ఆఫీసు నుండి వచ్చేటపుడు ఓ ఐస్ క్రీమ్ తెచ్చి మీ ఆవిడ ని కూల్ చేయండి.
తులా రాశి
మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చెయ్యడంతో, మీకు సంతోషం కలుగుతుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీర్చడమే ఈ రోజు మీ ప్రాధాన్యత. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి బంగారు నగలను ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తారు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.
వృశ్చిక రాశి
మీ స్వంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా, జాగ్రత్త వహించండి. మీరు వివాహము అయినవారు అయితే మీసంతానము పట్ల తగిన శ్రద్ద తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యము బారినపడే అవకాశము ఉన్నది.దీనివలన మీరు వారి ఆరోగ్యముకొరకు డబ్బును ఖర్చుపెట్టవలసి ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి, ప్రత్యేకమయిన రోజుగా చేసుకొండి. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం. ఈ రోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీఇంటికి వస్తారు. ఇంట్లో వంట చేయలేదు కాబట్టి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి అతనికి మర్యాద చేయండి.
ధనుస్సు రాశి
ఆరోగ్య సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చు. పైసల విషయంలో మీరు మీ జీవిత భాగస్వామి తో గొడవ పడుతారు.అయినప్పటికీ మీరు మీ టాలెంట్ తో తన ని కూల్ చేస్తారు. మీరు వారిని ఉత్సాహపరచి మీ కలలను నెరవేర్చేలా చేయగలరు. మీకంటే పెద్దవారు సీనియర్లని అలుసుగా తీసుకోకండి. వ్యక్తిగత సమయము ఎంతముఖ్యమో తెలుసుకుంటారు, ఈ రోజు మీకు చాలా ఫ్రీ టైమ్ దొరుకుతుంది, మీరు ఆడుకోడానికి లేక జిమ్ కు వెళతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
మకర రాశి
మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఈ రోజు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుట మంచిది. మీరు ప్రేమించిన వారితో గొడవ పెట్టుకుని వారిని అప్ సెట్ చేయకండి. మీ ప్రియమైన వ్యక్తి, మీరు సంతోషంగా ఉండడం కోసం మీకు ఇష్టమైన పనులు చేస్తారు. మీ ఆఫీసు లో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. లేదంటే మీ సీనియర్ ల ముందు మీ ఇజ్జత్ పోయే ప్రమాదం ఉంది. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.
కుంభ రాశి
ఈ రోజు వ్యాపారస్తులు వారి వ్యాపారము కోసం ఇంటినుండి బయటకు వెళ్లినట్టయితే డబ్బుని జాగ్రతగా దాచుకోవాలి లేనిచో మీ ధనము దొంగిలించబడవచ్చు. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా విన్పిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలనూ మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. మీరు మీయొక్క ఖాళీసమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది.
మీన రాశి
ఈ రోజు మీకు విశ్రాంతి రోజు . శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈరోజు మిమ్ములను మీరు అనవసర,అధికఖర్చులనుండి నియంత్రించుకోండి.లేకపోతే మీకు ధనము సరిపోదు. పండుగలు పబ్బాలు/ వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ రెస్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి మంచి రోజు. మీరు మీయొక్క ఖాళీసమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
మీ విలువైన అభిప్రాయాన్ని మాకు మెయిల్ teluguflashnews21@gmail.com ద్వారా తెలియచేయండి. అలాగే మా న్యూస్ షేర్ చెయ్యండి.
read more news :
Layoffs : ఇలా జాబ్స్ పోతే ఎలా ? AI మహా డేంజర్ గురూ! ఐటీ ఉద్యోగులకు ఇక దారేది?
Restaurant : తిందామని పోతే బిల్లు లక్ష.. తర్వాత హోటల్ వాడికి పడింది శిక్ష
Tom Holland about RRR Film : భారత పర్యటన, RRR అద్భుతం.. స్పైడర్ మ్యాన్ కామెంట్స్.. వీడియో వైరల్
Sakshi Malik | ఇదేం ట్విస్ట్ .. రెజ్లర్ల నిరసన నుంచి సాక్షి మాలిక్ తప్పుకుందా ? నిజమెంత ?
Anasuya : డియర్ నిక్కూ.. భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన అనసూయ..