Homebeautydandruff : చుండ్రు పోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి?

dandruff : చుండ్రు పోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి?

Telugu Flash News

dandruff : మగవారికైనా, ఆడవారికైనా చుండ్రు సమస్య వచ్చిందంటే.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఆ చుండ్రు చికాకు పెడుతుంటే ఏమి చేయాలో.. ఈ క్రింది టిప్స్ పాటించి చూద్దాం..

  1. గ్లిజరిన్ తలకు పట్టించి, మర్దన చేసి నాలుగు, అయిదు గంటలు ఆగిన తర్వాత తలస్నానం చెయ్యాలి.
  2. పెరుగును తలకు పట్టించి, రెండు గంటల తర్వాత స్నానం చేస్తే చాలు.
  3. కోడిగుడ్డు సొనని గిలకొట్టి దాన్ని తలకు పట్టించి రెండు గంటల తర్వాత స్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తే ! dandruff
  4. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ రాయటం ద్వారా కూడా చుండ్రును నివారించవచ్చు.
  5. వేపాకు వేసి కాసిన నీటితో తలస్నానం చేసినా చుండ్రు మటుమాయం.
  6. చుండ్రు వలన వెంట్రుకలు రాలిపోతుంటే కొబ్బరి కాల్చి ప్రతిరోజూ ఆ ప్రదేశంలో పూస్తుంటే వెంట్రుకలు తిరిగి వస్తాయి. దీనికోసం హోమియో ఆయిల్ కూడా ఉంటుంది.

పై చిట్కాలను ఒకటి రెండు సార్లు వాడి ఆపకుండా అయిదారు నెలలు క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ఈ పద్ధతులు పాటించాక కుంకుడురసంతోనే తలస్నానం చెయ్యా లన్నది మాత్రం మరువకండి.

మరిన్ని వార్తలు చదవండి :

pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా త‌గ్గించుకోండి..!

Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..

how to get soft feet : మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

-Advertisement-

మీ చేతులు మృదువుగా, నాజూకుగా తయారవ్వాలంటే ఏం చేయాలి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News