Telugu Flash News

Prabhu Deva : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన ప్రభుదేవా.. ఇప్పుడు ఇదే వైరల్ న్యూస్

prabhu deva

prabhu deva

యాభై ఏళ్ల వయసులో హీరో ప్రభుదేవా (Prabhu Deva) తండ్రి అయ్యాడనే వార్త ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రభుదేవా తన మొదటి భార్య రామలతకు 2011లో విడాకులు ఇచ్చాడు.వీరికి ముగ్గురు పిల్లలు కాగా, పెద్ద కొడుకు క్యాన్సర్‌తో చనిపోయాడు. నయనతారతో సహజీవనం చేసిన ప్రభుదేవా తన భార్య నుంచి విడాకులు తీసుకోవాలనుకున్నాడు. అప్పట్లో ఇది పెద్ద విషయం. విడాకులు కోరుతూ రామలత కోర్టును ఆశ్రయించారు. అలాగే నయనతారతో ప్రభుదేవా సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.

కానీ ప్రభుదేవా-రామలత విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల తర్వాత కూడా నయనతారతో ప్రభుదేవా అనుబంధం కొనసాగింది. త్వరలో పెళ్లి ఉండగా , అనుకోని విదంగా వీరు బ్రేకప్ చెప్పకున్నారు. వీరి మధ్య విభేదాలకు కారణాలు తెలియరాలేదు. కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న ప్రభుదేవా 2020లో డాక్టర్ హిమానీ సింగ్‌ను నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

prabhu deva with wife

ప్రభుదేవా రెండో భార్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ప్రభుదేవా 50వ పుట్టినరోజును హిమానీ సింగ్ ప్రత్యేకంగా జరుపుకున్నారు. వీడియో రూపొందించారు. భార్య ప్రేమకు ప్రభుదేవా సంబరపడిపోయాడు. ఆ తర్వాత హిమానీ సింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతలో హిమానీ సింగ్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇపుడు హాట్ టాపిక్. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా ఈ విషయం చక్కర్లు కొడుతుంది.

read more : TS IAS అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు.. అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారని ఆరోపణ

Samantha Hot Video : సెర్బియా పబ్ లో ఆ హీరో తో సమంత స్టెప్పులు.. వీడియో వైరల్

Exit mobile version