Homecinemaఈ వారం పసందైన విందుతో ఓటిటిలు సిద్ధం.. ఏ ఏ సినిమాలంటే ?

ఈ వారం పసందైన విందుతో ఓటిటిలు సిద్ధం.. ఏ ఏ సినిమాలంటే ?

Telugu Flash News

సినీ ప్రియులను పసందైన సినిమాలతో ఓటిటిలు అలరించనున్నాయి, ఈ శీతాకాలంలో బయటికి వెళ్లే ఆలోచనలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న ప్రేక్షకుల అభిరుచి మేరకు తమ యూజర్లను పెంచుకోవాలనే వ్యాపార కోణంలో కొన్ని ప్రత్యేక సినిమాలను తమ ఓటిటిలలో ప్రసారం చేయడానికి సిద్దపడ్డాయి.

బ్రహ్మాస్త్ర (డిస్నీ+ హాట్ స్టార్)

విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, రణబీర్ కపూర్ మరియు అలియా భట్ యొక్క బ్రహ్మాస్త్ర బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది. ఇప్పుడు, ఈ సినిమా ఈ వారాంతం డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.

పొన్నియిన్ సెల్వన్ 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో)

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చారిత్రాత్మక డ్రామా నవంబర్ 4న అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్ తదితరులు నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లను సాధించి ఈ ఏడాది అత్యంత విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఎనోలా హోమ్స్ 2 (నెట్‌ఫ్లిక్స్)

నవంబర్ 4న, షెర్లాక్ హోమ్స్ చెల్లెలు ఎనోలా హోమ్స్ తన మొదటి కేసును పరిష్కరించడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించింది అయితే ఆమె విజయవంతం అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే.

బుల్లెట్ ట్రైన్ (నెట్‌ఫ్లిక్స్)

స్టైలిష్ యాక్షన్‌తో నిండిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్, జోయి కింగ్ మరియు సాండ్రా బుల్లక్ నటించారు. బుల్లెట్ ట్రైన్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది. ఏడు వారాల పాటు బాక్స్ ఆఫీస్ చార్ట్‌లలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 5నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

బ్రీత్ ఇన్‌టు ది షాడోస్ సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో)

థ్రిల్లర్స్ ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకుల కోసం, అభిషేక్ బచ్చన్ తన థ్రిల్లర్ సిరీస్ బ్రీత్ ఇన్‌టు ది షాడోస్ ఆఫ్టర్ మో మూడవ సీజన్‌ను తీసుకువస్తున్నాడు, ఈ సీజన్ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా? అన్నది వేచి చూడాలి. ఈ వెబ్ షో నవంబర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది

-Advertisement-

క్రౌన్ సీజన్ 5 (నెట్ ఫ్లిక్స్)

ఎమ్మీ అవార్డు గెలుచుకున్న ఈ షో రాణి ఎలిజబెత్ జీవితం మరియు పాలనను గురించి ప్రస్తావిస్తుంది. ఇప్పటికే నాలుగు సీజన్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ లో 5వ సీజన్ నవంబర్ 9 న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతుంది.

also read :

చలికాలం లో నిగనిగలాడే చర్మం కోసం… అద్బుతమైన చిట్కా

Viral Video : త‌న పిల్లలకు వేట నేర్పిస్తున్న ల‌య‌న్ కింగ్.. వీడియోని చూస్తే వావ్ అనక మాన‌రు…!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News