HomehealthHerbal Tea for Thyroid: థైరాయిడ్‌ అదుపులో ఉంచుకోవాలంటే ఈ టీ తీసుకోండి.. ఖాళీ కడుపుతో తాగితే మెరుగైన ఫలితాలు!

Herbal Tea for Thyroid: థైరాయిడ్‌ అదుపులో ఉంచుకోవాలంటే ఈ టీ తీసుకోండి.. ఖాళీ కడుపుతో తాగితే మెరుగైన ఫలితాలు!

Telugu Flash News

Herbal Tea for Thyroid : థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్న వారు ఆహారం తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం చాలా మంది థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. గజిబిజి జీవన శైలి కారణంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్లు, మినరల్స్ బాడీకి అందకపోవడం లాంటి కారణాలతో థైరాయిడ్‌ వ్యాధి బారిన పడుతుంటారు. తాజా అధ్యయనాల ప్రకారం ప్రతి పది పందిలో ఐదుగురు థైరాయిడ్‌ జబ్బుతో సతమతం అవుతున్నారని తేలింది. శరీరంలో కొన్ని కీలకమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి.

థైరాయిడ్‌ టీ3, టీ4 అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని చాలా భాగాలతో థైరాయిడ్‌ ముడిపడి ఉంటుంది. థైరాయిడ్‌ సమస్య వచ్చిందంటే శరీరంలోని చాలా భాగాలు ప్రభావం అవుతాయి. శ్వాస వ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణ వ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ లాంటి వాటిపై ప్రధానంగా థైరాయిడ్‌ హార్మోన్‌ ఎఫెక్ట్‌ చూపుతుంది. ముఖ్యంగా గర్భిణులకు పిండం ఎదిగే క్రమంలో కణాల ఎదుగుదలకు, జీవ క్రియలు సక్రమంగా జరిగేందుకు థైరాయిడ్‌ హార్మోన్‌ ఉపయోగపడుతుంది.

ఈ సమయంలోనే థైరాయిడ్‌ సమస్య ఏర్పడితే.. శరీరంలోని జీవ క్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో సరిపడా థైరాక్సిన్‌ను ఉత్పత్తి జరగక ఇబ్బంది తలెత్తుతుంది. హైపోథలామస్‌, పిట్యూటరీ, థైరాయిడ్‌ వ్యవస్థల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి పనితీరుపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజం లాంటివి ఇబ్బందిపెడతాయి. ఒక్కసారి ఈ సమస్య మొదలైందంటే శరీరంలో చాలా సమస్యలు చుట్టుముడతాయి.

హెర్బల్‌ టీతో థైరాయిడ్‌కు చెక్‌..

థైరాయిడ్‌ సమస్య వస్తే అధికబరువు పెరిగిపోవడం, లేదా అమాంతంగా తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి. అలాగే జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. అలసట, రుతుక్రమం సరిగా రాకపోవడం, గర్భధారణలో సమస్యలు ఏర్పడటం లాంటి సమస్యలను అటాక్‌ చేస్తాయి. ఈ నేపథ్యంలో థైరాయిడ్‌ నివారణకు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఒకటి హెర్బల్‌ టీ తీసుకోవడం. ఓ గ్లాసు నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల ధనియాలు వేయాలి. 9 నుంచి 12 కరివేపాకు రెమ్మలు వీటిలో కలపాలి. డ్రై రోజ్‌ పెడల్స్‌ కొన్ని కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఇలా హెర్బల్‌ టీ తయారు చేసుకొని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల థైరాయిడ్‌ సమస్య తగ్గుముఖం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News