Health Tips in Telugu
- అరటిపండు తీసుకోండి. అతిసార వ్యాధిని నియంత్రించండి.
- ద్రాక్ష తీసుకుంటే అతి బరువును తగ్గించుకున్నట్లే. అంతేనా! మూత్రపిండాల్లో రాళ్ళను కూడా అరికడుతుంది. ఈ పండు సగానికి కట్చేసి దాంతో వలయాకారంగా మర్దన చేసి 20 నిముషాల తర్వాత కడుక్కుంటే ముడతలు మాయం!
- ఆరంజ్ తీసుకొని రోగనిరోధక శక్తిని పెంచుకోండి.
- స్ట్రాబెర్రీలో జ్ఞాపకశక్తిని పెంచే సుగుణాలున్నాయి. ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం. దీనిలో ఉండే సీ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు.
- తరచుగా పుచ్చపండ్లు తింటే బ్లడ్ ప్రెషర్ అరికట్టే పని ఇక దానిదే!
- పచ్చి కూరగాయలు, ఆకులను తినేముందు తప్పనిసరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కడగాలి. ఇలా చేయటం వలన దానిపైన ఉన్న దుమ్ము, ధూళి, క్రిమికీటకాలు, పురుగుల మందుల ప్రభావం అన్నీ పోతాయి.
- వేపచెట్టు బెరడుని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని ప్రతిరోజూ కొద్ది మోతాదులో తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.
- ప్రతిరోజూ ఉదయం వేపచిగురును కొద్దిగా తింటే క్యాన్సర్కు మందులా పనిచేస్తుంది.
- పళ్ళు తోముకోవడానికి రకరకాల పేస్ట్లను వాడే బదులు వేపపుల్ల వాడితే పళ్ళనుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ళ వ్యాధుల వంటి సమస్యలు రావు.
- వేప ఆకును నూరి గాయంపై రాస్తే త్వరగా మానుతుంది.
- ఎక్కువదూరం నడిచినప్పుడు కాళ్ళకు అలసట కలిగి కాళ్ళ నొప్పులు వస్తాయి. ఆ నొప్పి తగ్గాలంటే కాళ్ళకు నిమ్మ రసం రాస్తుండాలి.
also read :
Health Tips (14-03-2023) : ఈ 10 ఆరోగ్య చిట్కాలు.. మీ కోసం..
Health Tips (08-03-2023) : ఈ 9 ఆరోగ్య చిట్కాలు పాటించి చూడండి..
-Advertisement-