తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) తలపెట్టిన యువగళం (yuvagalam) పాదయాత్రకు లైన్ క్లియర్‌అయ్యింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. నిబంధనలు పాటిస్తూ లోకేష్ పాదయాత్ర చేసుకోవచ్చని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. లోకేష్ పాదయాత్రకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు.
పాదయాత్రకు అనుమతి కోరుతూ తొలుత డీజీపీకి టీడీపీ నేతలు లేఖ రాశారు. దీనిపై కొన్నాళ్లు స్పందించని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. టీడీపీ మరోసారి రిమైండర్ లేఖ రాయడంతో స్పందించారు. పాదయాత్ర పూర్తి వివరాలు, ఎక్కడెక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు, పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలుస్తారనే పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. డీజీపీ స్పందనపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పాదయాత్ర ఏ జిల్లాలో మొదలవుతుందో నాలుగు రోజులు ముందుగా మాత్రమే వివరాలు ఆ జిల్లా ఎస్పీకి సమర్పిస్తామని స్పష్టం చేశారు టీడీపీ నేతలు.
అనంతరం లోకేష్ పాదయాత్రపై చిత్తూరు జిల్లా ఎస్పీ స్పందించారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకొనే ఉద్దేశం తమకు లేదన్న ఎస్పీ.. 15 నిబంధనలు విధించినట్లు తెలిపారు. పాదయాత్రలో ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించ కూడదని పేర్కొన్నారు. బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదన్నారు. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించాకుడదని హెచ్చరించారు. అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పూజలు, ప్రార్థనలతో మొదలు..
పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో తాతకు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి కడపకు వెళ్తారు. అనంతరం దేవుని కడప లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు. అమీన్ పూర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి తిరుపతికి బయల్దేరుతారు. 26న ఉదయం తిరుమల శ్రీవారిని లోకేష్ దర్శించుకోనున్నారు. 27న కుప్పం వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేసి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు లోకేష్.
also read :
Sharwanand : శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా ?
Uttar Pradesh : యూపీలో ఇద్దరు యువతుల ప్రేమ కథ.. ట్విస్టులు మామూలుగా లేవు !
Sourav Ganguly : గంగూలీ బయోపిక్‌కు వేగంగా అడుగులు.. హీరోగా ఎవరు నటిస్తున్నారంటే!