Telugu Flash News

Google Layoffs : గూగుల్‌ కీలక నిర్ణయం.. 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన

Google laying off 12,000 employees

Google laying off 12,000 employees

Google Layoffs : ప్రఖ్యాత సంస్థ గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. గూగుల్‌ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌ సంస్థ ఏకంగా 12 వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్వయంగా ప్రకటించారు. స్టాక్‌ మెమోలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఈ తొలగింపు కారణంగా తమ కొలువులు కోల్పోనున్నారు. మొదట యూఎస్‌లోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్‌ పేర్కొంది.

ఇటీవల దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కూడా దాదాపు 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించి ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాజాగా గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. గతేడాది నుంచి మాంద్యం కారణంగా ప్రముఖ సంస్థలన్నీ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని భయాందోళన నడుమ ఉద్యోగులు రోజులు లెక్కపెడుతున్నారు.

అన్ని విభాగాల్లోనూ అల్ఫాబెట్‌ తన ఉద్యోగులను తొలగించే కార్యక్రమం చేపట్టింది. రిక్రూట్‌మెంట్‌ వింగ్‌, కార్పొరేట్‌ ఫంక్షన్‌, ఇంజనీరింగ్‌, ప్రొడక్ట్‌ విభాగంసహా కీలక వింగ్‌లలో తొలగింపు జరుగుతోందని గూగుల్‌ వెల్లడించింది. ఈ ప్రభావం అమెరికాలో వెంటనే కనిపిస్తుందని పేర్కొంది. మాంద్యం ప్రభావం కారణంగానే ఉద్యోగులను గూగుల్‌ తొలగిస్తోందని సమాచారం. ప్రస్తుతం సాంకేతికపరమైన స్థాయిలో కంపెనీలు పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్న తరుణంలో ఇలా లేఆఫ్‌లు కొనసాగించడంపై ఆసక్తిగా మారింది.

తొలగింపు తర్వాత ఆరు నెలల సపోర్ట్‌..

యూఎస్‌ ఎదుట విస్తృత అవకాశాలున్నాయని చెప్పిన సుందర్ పిచాయ్‌.. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక మతలబు ఏంటనేది అంతుపట్టడం లేదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తమ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగబోతున్నాయని పేర్కొన్న తర్వాత లేఆఫ్స్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది. అమెరికాలోని ఉద్యోగులు కనీసం రెండు నెలల నోటీస్‌ పీరియడ్‌ జీతాన్ని పొందుతారు. దాంతోపాటు కంపెనీ 2022 బోనస్‌లు, మిగిలిన వెకేషన్ సమయం, ఆరు నెలల హెల్త్‌ బెనిఫిట్స్‌, జాబ్‌ ప్లేస్‌మెంట్‌ సేవలు, ఇమిగ్రేషన్‌ మద్దతు కూడా ఇవ్వాలని గూగుల్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

also read: 

AP Politics : ఏపీలో వచ్చే ఎన్నికల్లో పట్టం ఎవరికి? వైసీపీకి మరో చాన్స్‌ ఇస్తారా? టీడీపీ వైపు మొగ్గు చూపుతారా?

Priyanka Chopra: నా బిడ్డ ద‌క్కుతుంద‌ని అనుకోలేదు.. డాక్టర్స్ దేవుడిలా ప్రాణం పోసార‌న్న ప్రియాంక చోప్రా

Exit mobile version