Today Gold Rates: బంగారం ధరలు ఒక్కోసారి మహిళలకు పెద్ద షాకే ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో బంగారం ధరలు కాస్త తగ్గిన పెరగడంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. సెప్టెంబర్ 26 (సోమవారం) బంగారం ధర బాగానే పెరిగింది.
22 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేకపోగా, 24 క్యారెట్ల బంగారంపై మాత్రం భారీగా పెరగడంతో మహిళలు కంగుతిన్నారు. తులం పసిడిపై ఏకంగా రూ.1800 వరకు ఏగబాకగా, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. పసిడి ధరలలో మార్పులకి పలు కారణాలు ఉన్నాయి. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూస్తే..
షాకిచ్చే న్యూస్..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,000 వద్ద కొనసాగుతుంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 గా ఉంది..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 గా కొనసాగుతుంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 గా ఉంది.
ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 గా నడుస్తుంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000గా కొనసాగుతుంది.
ఇక వెండి ధరలు మాత్రం ప్రస్తుతం నిలకగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,800 ఉండగా, విజయవాడలో రూ.61,500 ఉండడం విశేషం.