Gold Rates Today: బంగారం ధర ఏ మాత్రం తగ్గడం లేదు. అమాంతం పెరుగుతూనే ఉంది. ఇవాళ మనదేశంలో బంగారం ధరల్లో మార్పులు లేవు. అమెరికన్ డాలర్ బలపడుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుముఖం పడుతోంది.
ప్రస్తుతం ఔన్స్ (28.35 గ్రాములు) 2,021 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం, స్వచ్ఛమైన గోల్డ్ ధరల్లో మార్పులు లేనప్పటికీ కిలో వెండి ధర మాత్రం రూ.400 తగ్గింది.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,950 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.62,130 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.82,000 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం రేటు రూ.56,950గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.62,130 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 82,700 గా ఉంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.57,370 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,590గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.10 తగ్గింది. రూ. 29,250 వద్దకు చేరింది.
Read Also : Weather Today (12-05-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..