Homecinemaగాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుక కి అంతా సిద్దం..ఎప్పుడు..ఎక్కడంటే ?

గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుక కి అంతా సిద్దం..ఎప్పుడు..ఎక్కడంటే ?

Telugu Flash News

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో జరగనుందని మనకు తెలిసిన విషయమే. అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఈ ఈవెంట్ గురించి నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

28 సెప్టెంబరు, 2022న అనంతపురంలోని గవర్నమెంట్ కళాశాల మైదానంలో సినిమా ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించబడుతుందని సినీ నిర్మాతలు ట్విటర్ లో వెల్లడించారు. ఈ వేడుక సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనేది ఇంకా ప్రకటించలేదు.

గాడ్ ఫాదర్

ఇంకా ఈ చిత్రంలో నయనతార, పూరీ జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో అక్టోబర్ 5 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News