HomecinemaNiharika:నిహారికతో విడాకుల విష‌యంపై క్లారిటీ ఇచ్చిన భ‌ర్త‌.. దీంతో ఫిక్స్ అయిపోవ‌చ్చా..!

Niharika:నిహారికతో విడాకుల విష‌యంపై క్లారిటీ ఇచ్చిన భ‌ర్త‌.. దీంతో ఫిక్స్ అయిపోవ‌చ్చా..!

Telugu Flash News

Niharika:మెగా ఫ్యామిలీకి ఎవ‌రి జిష్టి త‌గిలిందో ఏమో కాని ఇటీవలి కాలంలో ఆ ఫ్యామిలీకి కాలం అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌, ఆ ఇంటి ఆడ‌బిడ్డ‌ల విడాకుల విష‌యం మెగా అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఆ రెండు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయ‌నే టాక్ కొద్ది రోజులుగా న‌డుస్తుంది.

ఇక ఈ మ‌ధ్య నిహారిక విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి అనంత‌రం ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది. ఇక పెళ్లి తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్ మానేసిన ఈమె మళ్ళీ ఇప్పుడు న‌టిగా తన స‌త్తాను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.

అయితే కొంతకాలంగా విడాకులకు సంబంధించి ఎన్నో ప్ర‌చారాలు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నిహారిక భర్త చైతన్యతో గత కొంతకాలంగా దూరంగా ఉంటుందని, ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న నేప‌థ్యంలో విడాకులు తీసుకొని ఎవ‌రికి వారు విడివిడిగా ఉంటున్నార‌నే టాక్ న‌డిచింది.

అయితే ఇలా పుకార్లు రావ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు.నిహారిక‌, చైత‌న్యలు త‌మ ఇన్‌స్టాగ్రాములో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాదు పెళ్లికి సంబంధించిన ఫోటోలు అన్నిటిని కూడా పూర్తిగా తొల‌గించారు . దీంతో పరోక్షంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నార‌ని అంద‌రు అనుకుంటున్నారు. గ‌తంలో స‌మంత కూడా ఇలానే చేసి త‌ర్వాత త‌న విడాకుల ప్ర‌క‌న‌ట చేసింది.

ఈ మధ్య కాలంలో నిహారిక-వెంకట చైతన్య కలిసి కనిపించ‌నేలేదు. మూవీ ఓపెనింగ్స్ లోను, టూర్స్ లోను నిహారిక ఒక్క‌తే సోలోగా క‌నిపించింది. తాజాగా జరిగిన ఘటనతో మరోసారి నిహారిక‌ విడాకుల రూమర్స్ మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. వెంకట చైతన్య త‌న కుటుంబ సభ్యులతో పాటు తిరుమలకి వెళ్ల‌గా, అక్కడ మీడియా కంట పడడంతో త‌మ కెమెరాలో బంధించారు.

వారితో పాటు నిహారిక లేక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు వెంకట చైతన్యకు దూరమైందని మీడియా వర్గాలు బలంగా నమ్ముతున్నారు. త్వ‌ర‌లోనే వీరు వీరి విడాకుల విష‌యంపై పూర్తి క్లారిటీ ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు అని చెబుతున్నారు. ఇక 2020 డిసెంబర్ 19న నిహారిక-వెంకట చైతన్యల వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలస్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం విదితమే. ఐదు రోజుల పాటు జ‌రిగిన వీరి పెళ్లి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

-Advertisement-

read more news :

Niharika : ఎవ‌డో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నాకెందుకు.. నిహారిక ఫైర్

Niharika: ఆ రెండు ఫొటోలు మిన‌హా భ‌ర్త జ్ఞాపకాలు పూర్తిగా చెరిపేసిన నిహారిక‌.. ఏం జ‌రుగుతుంది..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News