Homenationalఅదానీ ఇంట్లో పెళ్లి సందడి.. కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం.. కోడలు ఎవరంటే..

అదానీ ఇంట్లో పెళ్లి సందడి.. కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం.. కోడలు ఎవరంటే..

Telugu Flash News

Gautam Adani’s son Jeet Adani gets engaged to Diva Jaimin Shah : బడా పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడు జీత్‌ అదానీ వివాహం చేసుకోనున్నాడు. ప్రముఖ వజ్రాల వ్యాపారి సి.దినేష్‌ అండ్‌ కో ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత దివా జైమిన్‌ షా కుమార్తె దివాతో జీత్‌కు ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది. ఈనెల 12న ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కొద్ది మంది బంధువులు, మిత్రులు మాత్రమే వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రైవేటుది కావడంతో వివరాలు బయటకు వెల్లడి కాలేదు.


also read : The elephant whisperers: ఆస్కార్ తెప్పించిన ఏనుగులు మాయం.. ఏం జ‌రిగిందంటూ అంద‌రిలో చ‌ర్చ‌


అదానీ కుమారుడి నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాబోయే దంపతులు సంప్రదాయబద్దంగా దుస్తులు ధరించారు. చూడముచ్చటగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్‌ చేపించిన లెహంగా, లైట్‌ బ్లూ కలర్‌ దుపట్టాలో అమ్మాయి దివా తళుక్కుమంది. జీత్‌ అదానీ సైతం అదే కలర్‌ దుస్తులు వేసుకొని కనిపించాడు. లేత నీలి రంగు కుర్తాతో ఎంబ్రాయిడరీ జాకెట్‌ వేసుకోవడంతో పెళ్లికళ కొట్టొచ్చినట్లు కనిపించిందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


watch this : Sreemukhi Latest Hot Photos, Images, Stills, pictures 2023


ఇక అదానీ తనయుడి పెళ్లి అనగానే వధువు ఎవరా అని అందరూ ఆసక్తిగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దివా బ్యాగ్రౌండ్‌ను కనుక్కొనే పనిలో పడ్డారు. ఆమె సంపన్న కుటుంబానికి చెందిన యువతిగా చెబుతున్నారు. ఆమె తండ్రి జైమిన్ షా సి.దినేష్‌ అండ్‌ కో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఓనర్‌. ఈ సంస్థ ముంబై, సూరత్‌ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక అదానీ తనయుడు జీత్‌ కూడా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ అప్లయిడ్‌ సైన్సెస్‌లో చదువుకున్నాడు. ఇటీవలే అంటే 2019లో తండ్రికి చెందిన వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాడు.


Recommended : S S Karthikeya : ఆస్కార్ రావ‌డానికి మూల కార‌ణం రాజ‌మౌళి కాదు , ఆయ‌న కొడుకు..!

-Advertisement-

అదానీ గ్రూప్‌లో ఫైనాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా జీత్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గ్రూప్‌ సీఎఫ్‌వో ఆఫీస్‌లో ప్రస్థానం మొదలు పెట్టిన జీత్‌ స్ట్రాటజిక్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, రీస్క్ అండ్ గవర్నెన్స్ పాలసీపై ఫోకస్‌ పెట్టాడని అదానీ సంస్థ తెలిపింది. మరోవైప అదానీ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌తో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్ వ్యవహారాలు కూడా జీత్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ నివేదిక ఎఫెక్ట్‌తో అదానీ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలుతున్న తరుణంలో ఆ ఇంట్లో శుభకార్యం జరగడం కాస్త ఊరట కలిగించే అంశంగా వ్యాపారవేత్తలు విశ్లేషిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News