Gautam Adani : ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో వెలిగిపోయిన భారతీయ తేజం.. అంచెలంచెలుగా ఎదిగిన ప్రస్థానం.. నేడు అధఃపాతాళానికి చేరుతున్న వేళ.. కళ్ల ముందే లక్షల కోట్ల సంపద మంచులాగా కరిగిపోతున్న తరుణం.. ఏం చేసినా ఆగని పతనం.. వెరసి ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచిన అపర కుబేరుడు గౌతమ్ అదానీ.. ఇప్పుడు లక్షల కోట్ల సంపదను కోల్పోతున్నారు.
నెల రోజుల్లోనే దాదాపు 12 లక్షల కోట్లకుపైగా సంపద ఆవిరైపోవడం, తన పతనం ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ఆయనను దిక్కుతోచని స్థితికి చేర్చి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పారిశ్రామిక వేత్తలకు ఒడిదొడుకులు సాధారణమే అయినప్పటికీ ఇంతటి పతనం అదానీ ఊహించలేకపోయారు.
హిండెన్‌బర్గ్ అనే నివేదిక రూపంలో అదానీ వ్యాపార సామ్రాజ్యంపై పిడుగులా పడింది. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానం నుంచి ఇప్పుడు 30వ స్థానానికి అదానీ పడిపోయారు.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఈ నివేదిక ఇచ్చింది మొదలు అదానీ పతనం అప్రతిహతంగా కొనసాగుతోంది. తర్వాత హిండెన్‌బర్గ్ నివేదికలోని అంశాలు నిరాధారమైనవని, ద్వేషపూరితమైనవని ఎంత వివరణ ఇచ్చుకున్నా అదానీకి ఫలితం దక్కలేదు.
తాజా గణాంకాల ప్రకారం అదానీ సంస్థల నష్టాలు కొనసాగుతున్నాయి. అదానీకి చెందిన పది లిస్టెడ్ కంపెనీల సంపద సుమారు 12 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
ఫ్రాన్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అదానీ గ్యాస్ లిమిటెడ్ మార్కెట్ విలువ గడచిన నెల రోజుల్లోనే 80.68 శాతం పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 74.62 శాతం వరకు నష్టపోవాల్సి వచ్చింది. జనవరి 24వ తేదీ నుంచి ఇప్పటిదాకా అదానీ ట్రాన్స్‌మిషన్ విలువ 74.21శాతం దిగజారింది.
ఇక అదానీ పవర్, అదానీ విల్మర్, సిమెంట్ యూనిట్స్, మీడియా, అదానీ పోర్ట్స్, సెజ్‌ల మార్కెట్ విలువ కూడా భారీగా తగ్గింది.
హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించక ముందు 120 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ.. ఏకంగా 80.6 బిలియన్ల సంపదను నష్టపోయారు.
వ్యాపార సామ్రాజ్యంలో పోటీదారుడైన ముకేశ్ అంబానీ ఆసియాలోనే మూడో అత్యంత సంపన్నుడిగా ఉండగా, ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో 10 స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుత సంపద విలువ 81.7 బిలియన్ డాలర్లని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
also read :
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఇది కదా.. 15 రోజులకు రూ. 50 కోట్ల పారితోషికం
Pooja Hegde: పూజా హెగ్డే- త్రివిక్రమ్ మధ్య ఏం నడుస్తుంది.. కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా.. !