HomenationalCongress: రాయ్‌పూర్‌ ప్లీనరీలో కాంగ్రెస్‌కు క్లారిటీ వచ్చేసినట్లేనా? ఎన్నికల్లో ప్రభావం ఎంత?

Congress: రాయ్‌పూర్‌ ప్లీనరీలో కాంగ్రెస్‌కు క్లారిటీ వచ్చేసినట్లేనా? ఎన్నికల్లో ప్రభావం ఎంత?

Telugu Flash News

Congress plenary news today : రాయ్‌పూర్‌ వేదికగా అఖిల భారత కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు ఈరోజు ముగిశాయి. పార్టీకి పూర్వ వైభవం తెచ్చి దేశంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఈ సమావేశాలు సాగాయి. బీజేపీని దేశ వ్యాప్తంగా ఎలా ఎదుర్కోవాలో రూట్‌ మ్యాప్‌ డిక్లేర్‌ చేయడం ద్వారా కాంగ్రెస్‌ తన దూకుడును పెంచిందంటూ విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. అయితే, అత్యంత బలంగా ఉన్న మోదీ, అమిత్‌ షా ద్వయం రాజకీయం ముందు కాంగ్రెస్‌, ప్రతిపక్షాలన్నీ ఏకమై నిలబడగలవా? అనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారుతోంది.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కార్యారణ సిద్ధం చేశామని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. అన్యాయం, అక్రమాలు, అవినీతిపై పోరాటం చేసేందుకు సమరశంఖం పూరించామని కాంగ్రెస్‌ ప్లీనరీలో ముఖ్య నేతలు స్పష్టం చేశారు. రాయ్‌పూర్‌ డిక్లరేషన్‌లో పొత్తులు, ఎన్నికల్లో పోటీపైనా క్లారిటీ ఇచ్చేశారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకొని ముందుకెళ్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే వచ్చేఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీతో కలిసేదెవరు? పొత్తులు పెట్టుకొనేది ఎవరనేది క్లారిటీ రావాల్సిఉంది. మోదీ సర్కార్‌ను ఎదుర్కొనే ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటేనని కార్యకర్తల్లో జోష్‌నింపే ప్రయత్నం చేశారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. మరోవైపు ప్లీనరీ వేదికగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ జోడోయాత్ర విజయవంతంతో తన పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుండటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇక రాహుల్‌ గాంధీ.. కీలక ప్రసంగం చేశారు. భారత్‌ జోడో యాత్రలో అనేక మందితో మమేకమయ్యానని చెప్పారు. రైతుల కష్టాలు, నిరుద్యోగుల ఇక్కట్లు, దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, అదానీకి దేశంలోని ప్రముఖ సంస్థలను కట్టబెడుతుండటం, ప్రైవేటైజేషన్‌ ఇలా అనేక అంశాలపై యువత నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్నానన్నారు. చైనా నుంచి అదానీ దాకా మోదీని టార్గెట్‌ చేస్తూ రాహుల్‌ ప్రసంగం సాగింది. అదానీ విషయంలో నిజాలు వెల్లడయ్యే దాకా పోరాటం చేస్తూనే ఉంటామన్న సందేశం రాహుల్‌ ఇచ్చారు. మొత్తానిక ప్లీనరీ వేదికగా కాంగ్రెస్‌ ఎన్నికల సమరశంఖం పూరించినట్లయింది. ఎన్నికల్లో ఏ మేరకు ఫలితాలొస్తాయనేది వేచి చూడాల్సిందే.

also read :

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్ అంటే ఇది క‌దా.. 15 రోజులకు రూ. 50 కోట్ల పారితోషికం

-Advertisement-

Kriti Sanon Hot Photo Gallery Collection, Images, Stills

Pooja Hegde: పూజా హెగ్డే- త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది.. కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా.. !

Raashi Khanna Latest instagram photos, images, stills 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News