Gauri khan : ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు కొందరు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్‌పై జరిగిన దాడిలో డ్రగ్స్ దొరకడంతో 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
అయితే అరెస్టయిన 20 మందిలో ఒకరైన బాలీవుడ్ స్టార్ షారుఖాన్ తనయుడు 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌ను నిందితుడిగా పేర్కొనలేదు కాని అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనేక కోర్టు విచారణలు, డ్రామాలు, 26 రోజుల కస్టడీ తర్వాత బాంబే హైకోర్టు ఆర్యన్‌కి బెయిల్ మంజూరు చేసింది.
ఎట్టకేలకు ఓపెన్ అయింది..
ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు షారూఖ్ ఖాన్ ఫ్యామిలీ ఎంతో ఆవేదన చెందింది. తమ కుమారుడిని బయటకు తీసుకొచ్చేందుకు నానా ప్రయత్నాలు చేసింది. అయితే ఈ కేసు గురించి ఇంత వరకు ఎవరు స్పందించలేదు.
తాజాగా షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ లో పాల్గొనగా, తొలిసారి తన కుమారుడి అరెస్టుపై పెదవి విప్పారు.. ఈ షోలో గౌరీ ఖాన్‌తో పాటు భావనా పాండే, మహీప్ కపూర్‌లు కూడా పాల్గొన్నారు.
అయితే డ్రగ్స్ విషయం గురించి కరణ్ మాట్లాడుతూ.. అది చాలా కఠినమైన ప్రయాణం. ఈ కష్ట సమయంలో మీరంతా అండగా నిలబడ్డారు. ఒక తల్లిగా మీకు అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. మీరు గతంలో కంటే బలంగా తయారయ్యారు’ అని గౌరీతో కరణ్ అన్నారు.
దానికి గౌరీ ఖాన్ స్పందిస్తూ.. మేము అనుభవించిన దాని కంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఈ కష్ట సమయంలో అందరం ఒక కుటుంబంలా నిలబడి ఉన్నాము. అందరి నుండి ఎంతో ప్రేమ లభించింది. మాకు తెలియని వాళ్ల నుంచి కూడా మెసేజ్‌లు వచ్చాయి.
ఇదంతా చూస్తుంటే మనం గొప్ప ప్రదేశంలో ఉన్నామని అనిపిస్తుంది. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం’ అని గౌరీ చాలా ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు.