HomecinemaRana: రానాకు క‌ల్లు దావ‌త్ ఇచ్చిన గంగ‌వ్వ‌.. నిషాలో ఏం చెప్పాడో తెలుసా ? వీడియో వైరల్ !

Rana: రానాకు క‌ల్లు దావ‌త్ ఇచ్చిన గంగ‌వ్వ‌.. నిషాలో ఏం చెప్పాడో తెలుసా ? వీడియో వైరల్ !

Telugu Flash News

Rana: చాలా అమాయ‌కంగా ఉంటూ తెలంగాణ యాస‌లో గ‌ల‌గ‌ల మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గంగవ్వ. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె వృద్ధాప్యంలోకి వచ్చాక మాత్రం ఫుల్ ఫేమ‌స్ అయింది. యూట్యూబ్ లో ఫుల్ ఫేమస్ అయిన ఈమె .. బిగ్ బాస్ హౌస్ లోను అడుగుపెట్టి తెగ సంద‌డి చేసింది. గంగ‌వ్వ యూట్యూబ్‌తో పాటు బుల్లితెర, వెండితెర‌, ఇలా ప‌లు ర‌కాలుగా సంద‌డి చేస్తూనే ఉంటుంది.

గంగవ్వ చేసిన ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ వంటి సినిమాలు గంగవ్వకి మంచి పేరు ప్ర‌ఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ఇక తాజాగా వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కూడా న‌టించి మెప్పించింది. చిన్న హీరోలు మొదలు స్టార్‌ సెలబ్రిటీల వరకు కూడా గంగవ్వ చానెల్‌లో తమ సినిమా ప్రమోషన్స్‌ చేసుకోవాలని భావిస్తున్నారంటే.. ఆమె క్రేజ్‌ ఏం రేంజ్‌కి వెళ్లిందో అర్ధ‌మ‌వుతుంది.

తాజాగా రానా కూడా తన సినిమా ప్రమోషన్‌ కోసం గంగవ్వతో క‌లిసి సంద‌డి చేశాడు. ప్రస్తుతం రానా సమర్పణలో మసూద ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా పరేషాన్ అనే చిత్రం రూపొందింది. రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జూన్‌ 2న విడుదల చేయ‌బోతున్నారు. వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రానా త‌న టీమ్‌తో కలిసి మై విలేజ్ షోలో పాల్గొన్నారు.

ప‌రేషాన్‌ టీమ్‌తో కలిసి గంగవ్వ ఊరికి వచ్చిన‌ రానా… పల్లెటూరి వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేయ‌డ‌మే కాకుండా దావత్ కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. రానా చేత కల్లు తాగించి మంచి దావ‌త్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

అయితే రానా నిషాలో ఏమైన ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పాడా, గంగవ్వ టీం రానా ద‌గ్గ‌ర నుండి ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు లాగింది అనేది అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. త్వ‌ర‌లోనే ఫుల్ వీడియో విడుద‌ల కానుండ‌గా ఈ వీడియో కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రానా స‌మర్పిస్తున్న చిత్రానికి సంబంధించిన వీడియో ప్రేక్ష‌కుల‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.

ఈ క్ర‌మంలో సినిమాపై భారీ అంచనాలు కూడా నమోదు అయ్యాయి. ఈ సినిమాలో తిరువీర్ సరసన పావని హీరోయిన్ గా నటిస్తుండ‌గా ఆమెతో పాటు బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, బుద్దెర ఖాన్, రవి, రాజు బేడిగల, శృతి రాయన్, అంజి బాబు వాల్గమాన్, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత, సురభి రాఘవ, శివరామ్ మరియు సాయి కిరణ్ యాదవ్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా హిట్ ప‌డితే రానున్న రోజుల‌లో రానా నుండి మ‌రిన్ని మంచి సినిమాలు రానున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by My Village Show (@myvillageshow)

-Advertisement-

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News