Homenationalతన భర్తే అనుకొని ఆమె చేసిన పని చూస్తే.. నవ్వు ఆపుకోలేరు!

తన భర్తే అనుకొని ఆమె చేసిన పని చూస్తే.. నవ్వు ఆపుకోలేరు!

Telugu Flash News

ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. నిజ జీవితంలో కొందరికి అచ్చం తనలా ఉండే వ్యక్తులు కూడా తారసపడుతుంటారు. కవలల విషయంలోనూ కొన్ని సార్లు బంధువులు కూడా కన్ఫ్యూజ్‌ అవుతుంటారు. అయితే, రక్త సంబంధీకులు మాత్రం ఎంత కాదన్నా ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. కొందరు ఒకే రకమైన డ్రస్‌, హావభావాలు కలిగి ఉండటం కూడా గమనిస్తుంటాం. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ గురించి తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.

కర్ణాటకలో జరిగిన ఫన్నీ ఘటనలో రెండు జంటలు కన్ఫ్యూజన్‌కు గురయ్యాయి. రెండు జంటలు ఒకే రకమైన బైక్‌లపై ప్రయాణిస్తున్నారు. అయితే, వీరు నలుగురూ ఇంతకు ముందు పరిచయం కూడా లేదు. ఒకరినొకరు ఎప్పుడూ చూసి ఎరుగరు. ఇద్దరివీ వేర్వేరు ప్రయాణాలు. అయితే, బైకుల్లో పెట్రోలు ఇద్దరికీ ఒకేసారి అయిపోతుండగా.. ఒకే పెట్రోలు బంకు వద్దకు చేరుకున్నారు. అక్కడే అసలు ట్విస్టు చోటు చేసుకుంది.

కర్ణాటకలోని హవేరి జిల్లా రాణేబెన్నూరు వద్ద ఓ పెట్రోల్‌ బంక్‌ వద్దకు రెండు వేర్వేరు బైక్‌లపై రెండు జంటలు వచ్చాయి. పెట్రోల్‌ కొట్టించుకొనేందుకు మహిళలు ఇద్దరూ కిందకు దిగారు. ఓ పక్కకు వెళ్లి నిలబడ్డారు. ఇక అందులో ఒకరు పెట్రోలు నింపుకొని తన భార్య వద్దకు వచ్చి బైక్‌ ఎక్కమన్నాడు. ఆమె ఎక్కింది. ఇక దారిలో వెళ్తుండగా.. కొంత దూరం వెళ్లాక మన ఇంటికి దారి ఇటు కాదు కదండీ.. అని భార్య అనగానే అతడు ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. ఎందుకంటే వెనుక కూర్చున్నది తన భార్య కాదు.. అచ్చం అలాగే ఉండే మరో మహిళ.

తన భార్య కూడా సేమ్‌ కలర్‌ చీర కట్టుకోవడం ఇక్కడ కొసమెరుపు. ఆయన కూడా తన భర్తలాగే సేమ్‌ డ్రస్‌, సేమ్‌ బైక్‌, సేమ్‌ హెల్మెట్‌ ధరించి ఉండటంతో ఆమె కూడా తన భర్తే అనుకొని ఎక్కేసింది. ఇక వెంటనే పెట్రోల్‌ బంకు వద్దకు ఇద్దరూ బయల్దేరారు.

అప్పటికే ఈయన భార్య, ఈమె భర్త.. అక్కడ వేచిచూస్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికంగానే జరిగింది. అయితే, అప్పటికే అక్కడున్న వారంతా ఈ విషయం తెలుసుకొని నవ్వుకోవడం కనిపించింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

also read:

-Advertisement-

kiraak RP : అమెరికాలోను చేప‌ల పులుసు ప్లాన్ చేస్తున్న కిరాక్ ఆర్పీ

Mahesh Babu: మ్యారేజ్ డే సెల‌బ్రేష‌న్స్.. మ‌ళ్లీ విదేశాలకి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News