Weight loss : శరీరం మీద కాస్త శ్రద్ధ పెట్టకపోతే ఇంతే సంగతులు. లావుగా తయారయిపోతారు. ముందే జాగ్రత్త పడితే మంచిదిగదండీ ! అవి..
- వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం చెయ్యగానే నీరు త్రాగకూడదు.
- స్కిప్పింగ్ చేస్తే అందమైన నాజూకైన శరీరాకృతి వస్తుంది.
- నూనె పదార్థాలు తీసుకోకూడదు. డాల్డా, నెయ్యి ఆహారంలోంచి పూర్తిగా తొలగించాలి.
- మాంసాహారం మానెయ్యాలి.మసాలాలకు తిలోదకాలు ఇవ్వాలి.
- స్వీట్స్ తినకూడదు. అరటి పండ్లు తినకూడదు.
ఇవి పాటిస్తే నెలలోపు మీ బరువులో తేడా మీకే విచిత్రంగా అనిపిస్తుంది. వద్దన్నవి చెప్పారు. తినాల్సింది ఏమిటి అంటారా?
- బ్రెడ్, ఫ్రూట్స్, పండ్లరసాలు తీసుకోవచ్చు.
- టమోటాలు, దోసకాయలు పచ్చివి తినవచ్చు.
- పీచుపదార్థం ఉన్న కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా వాడాలి.
- వెన్నలేని మజ్జిగ త్రాగితే ఆరోగ్యం. చిక్కుడు గింజలు శ్రేష్టం.
- ఎక్కువగా మంచినీళ్ళు త్రాగాలి. ప్రతిరోజూ ఉదయం అరగంట, భోజనం అయిన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్రపోకూడదు.
ఒక్క సంవత్సరం ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు.
మరిన్ని అందమైన/ఆరోగ్యకరమైన వార్తలు చదవండి :
pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా తగ్గించుకోండి..!
Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..
Weight Loss Tips : బరువు తగ్గడానికి పంచౌషధాలు..
కొలెస్టరాల్ (CHOLESTEROL) అంటే ఏంటి ? కొలెస్టరాల్ ఎక్కువయితే ఏమవుతుంది?