Telugu Flash News

Diabetes : డయాబెటిస్ ఉన్న వారు ఉదయాన్నే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ?

diabetes

డయాబెటిస్‌ (Diabetes) తో బాధపడుతున్న వారు ఉదయాన్నే తీసుకొనే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రోజంతా మన దేహం ఉత్తేజంగా పని చేయడానికి ఉదయాన్నే తీసుకొనే ఫుడ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. పొట్ట నింపడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను సెలెక్ట్‌ చేసుకోవాలి.

Diabetes : మధుమేహ రోగులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

టిఫిన్‌లో షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఆహారాన్ని తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఉదయం పరగడుపున ఓ స్పూన్ ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు పొడి కలుపుకొని తినాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అదుపు చేస్తుంది. తీపి పదార్థాలు తినాలన్న కోరికలను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

Diabetes : మధుమేహం ఉన్నవారికి పప్పులు మంచివేనా? ఏ పప్పు తీసుకోవడం మంచిది?

ఓ టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ లేదా ఓ స్పూన్ ఉసిరి రసం తాగినా ఉపయుక్తంగా ఉంటుంది. ఓ గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగడం వల్ల ఈ ద్రావకాలు శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాన్ని చూపిస్తాయి. దాల్చిన చెక్క మధుమేహులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

Banana: అర‌టిపండుతో ఆరోగ్యంతో పాటు దుష్ప్ర‌భావం కూడా క‌లిగిస్తుంద‌నే విష‌యం మీకు తెలుసా?

మెంతి నీరు తాగడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను శోషించుకోకుండా రక్షిస్తుంది. ఓ టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచిది.

Exit mobile version