FlipKart: దసరా సందర్భంగా ఈకామర్స్ వెబ్ సైట్స్ బిగ్ బిలియన్ డేస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన నేపథ్యంలో ఆన్‌లైన్ కస్టమర్స్ ప్రొడక్ట్స్ విపరీతంగా కొనేస్తున్నారు.
అయితే కొన్ని సందర్భాలలో కొందరికి ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా ఒక కస్టమర్ ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేస్తే సోప్స్ వచ్చాయంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో అతను మొత్తం కష్టాలను వివరించాడు.
షాకింగ్ ఘటన..
వివరాలలోకి వెళితే యశస్వి శర్మ అనే వ్యక్తి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ల్యాప్ టాప్ ఆర్డర్ చేయగా, కొన్ని రోజులకి ఆర్డర్ వచ్చింది. ఇక తీరా ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేసి చూస్తే.. అందులో ల్యాప్‌టాప్‌కి బదులుగా ఘడి బట్టల సబ్బులు ఉన్నాయని యశస్వి శర్మ చెప్పుకొచ్చాడు. డెలివరీ బాయ్ సీసీటీవీ ఫూటేజ్ కూడా నా దగ్గర ఉంది.
ఈ విషయం గురించి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ.. వాళ్లు కూడా తనదే తప్పని నిందవేశారని పేర్కొన్నారు. ఈ విషయం తనను చాలా విస్మయానికి గురిచేస్తోందని యశస్వి శర్మ అంటున్నాడు.
సోషల్ మీడియాలో అతనికి జరిగిన అన్యాయంపై పోస్ట్ పెట్టగా ఇది వైరల్ అయింది. దీంతో ఫ్లిప్ కార్ట్ సీనియర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ స్పందించాడు. ఇప్పుడు మేము ల్యాప్ ట్యాప్ ఇవ్వడం కుదరదని ఖరాఖండీగా చెప్పుకొచ్చాడు. డెలివరీ సమయంలో ల్యాప్‌టాప్‌ని తనిఖీ చేయకుండా ఓటీపీ చెప్పడం అసలు తప్పు. మేము ఈ విషయంలో ఏం చేయలేము. దీనిపై ఇక ఏ రకంగాను స్పందించమని అన్నారు. .