HomeTechnologyఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ పై భారతదేశపు మొట్టమొదటి ట్విట్టర్ యూజర్ నైనా రెధు ఏమన్నారో తెలుసా?

ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ పై భారతదేశపు మొట్టమొదటి ట్విట్టర్ యూజర్ నైనా రెధు ఏమన్నారో తెలుసా?

Telugu Flash News

విఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ను ఇటీవల కొనేసిన ఎలాన్ మస్క్ (Elon Musk) తనదైన స్టైల్ లో చకచకా మార్పులు చేస్తున్నాడు. ట్విట్టర్ బ్లూ టిక్ కావాలని భావించే వాళ్ళ నుంచి ప్రతినెలా కొంత ఫీజును వసూలు చేయాలని మస్క్ యోచిస్తున్నారు. పరిమితికి మించి ఉన్న ఉద్యోగులను తీసేసే దిశగా ఇప్పటికే మస్క్ కసరత్తును మొదలుపెట్టారు. ట్విట్టర్ లో ఈవిధంగా వేగవంతమైన మార్పులు జరుగుతున్న తరుణంలో భారతదేశపు మొట్టమొదటి ట్విట్టర్ యూజర్ నైనా రెధు (naina redhu) ను ప్రముఖ వార్తా సంస్థ ఇంటర్వ్యూ చేసింది.

2006 నుంచి ట్విట్టర్ వాడుతున్న నైనా తాజా పరిణామాలపై ఏమన్నారో చూద్దాం..

“అది 2006 సంవత్సరం. అప్పట్లో Orkut, బ్లాగింగ్ చాలా ఫేమస్. ఆ టైంలో నాకు TWTTR (ట్విట్టర్ మొదటి పేరు) నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది. నేను ఆ లింక్ ను క్లిక్ చేసి.. నా మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యాను. ట్విట్టర్ ట్రయల్ దశలో ఉన్న టైం అది. నేను ఏడాది, ఏడాదిన్నర వాడిన తర్వాతే అఫీషియల్ గా ట్విట్టర్ విడుదల అయినట్టు గుర్తు. నేను ఇప్పటివరకు దాదాపు 1,75,000 ట్వీట్స్ చేశాను.

స్టార్టింగ్ లోనే నాకు ట్విట్టర్ లో బ్లూ టిక్ కూడా వచ్చేసింది. కాలక్రమంలో ట్విట్టర్ ప్రపంచ స్థాయి సోషల్ మీడియా బ్రాండ్ గా ఎదుగుతుందని నేను ఊహించలేదు. అప్పట్లో ట్విట్టర్ చాట్స్ లో ఇండియన్స్ ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. అందరూ అమెరికాలోని ట్విట్టర్ ఉద్యోగులు, వాళ్ళ స్నేహితులు, బంధువులే. వాళ్లే ఒకరికి ఒకరు ట్విట్టర్ లో మెసేజ్ లు పంపుకునే వాళ్ళు. ఇండియన్స్ లేరనే కారణంతో స్టార్టింగ్ లో దాదాపు ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం పాటు నేను ట్విట్టర్ లో నేను సైలెంట్ గా ఉండిపోయాను.

అప్పట్లో ఎవరో అమెరికా జర్నలిస్టు ట్విట్టర్ పై ఒక వ్యాసం రాస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ మొట్టమొదటి 140 మంది యూజర్స్ పేర్ల జాబితాను ప్రచురించారు. అందులో నా పేరు కూడా పబ్లిష్ కావడాన్ని చూసి సంతోషించాను.ట్విట్టర్ వినియోగాన్ని పెంచాను. అప్పట్లోనే నాకు ట్విట్టర్ లో బ్లూ టిక్ వచ్చింది.

16 ఏళ్లుగా ఫ్రీగా బ్లూ టిక్ వాడి వాడి.. ఇప్పుడు నెలవారీ ఛార్జీ కట్టమంటే ఎలా ? డబ్బున్న వాళ్లకు ఇదొక సమస్య కాదు. కానీ మధ్య తరగతికి చెందిన యూజర్స్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ కు ఆసక్తి చూపకపోవచ్చు. గత 16 ఏళ్లలో ట్విట్టర్ ఎంతో మారిపోయింది. ట్విట్టర్ యూజర్ల తరం మారిపోయింది. ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కాబట్టి ట్విట్టర్ న్యూస్ ను కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఏదైనా వార్త మీద డౌట్ వస్తే గూగుల్ లో సెర్చ్ చేసి నిజా నిజాలు తెలుసుకోవాలి.

ట్విట్టర్ స్టార్ట్ అయిన టైంలో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఉండేది. నాకు ఫాలోయర్స్ ను పెంచుకునే టెక్నీక్స్ ఉండేవి. నేను వాటిని ఫాలో కాలేదు. నన్ను ఫాలో అయ్యే ఒకరో ఇద్దరో వ్యక్తుల గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. వారిలో కొందరితో ఎప్పుడైనా చాట్ చేసి నాకు అవసరమైన విషయాలు తెలుసుకునే దాన్ని. నేను ఇన్స్టా గ్రామ్, ఫేస్ బుక్ కూడా వాడుతుంటాను” అని నైనా రెధు వివరించారు.

-Advertisement-

also read:

Bigg Boss 6: ఈ వారం నామినేష‌న్స్.. టార్గెట్ ఇన‌య‌.. ఇంకా ఎవ‌రెవ‌రు నామినేట్ అయ్యారంటే..!

చంద్ర గ్రహణం గర్భిణిలపై ప్రభావం చూపుతుందా ? నిజమెంత ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News