HomecinemaAcharya Movie Set : చిరంజీవి మూవీ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం.. సిగ‌రెట్ వ‌ల్ల‌నే సంభ‌వించిందా..!

Acharya Movie Set : చిరంజీవి మూవీ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం.. సిగ‌రెట్ వ‌ల్ల‌నే సంభ‌వించిందా..!

Telugu Flash News

Acharya Movie Set : మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్‌లో పెద్ద అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. కాల్చి ప‌డేసిన సిగ‌రెట్ వ‌ల‌న ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని భావిస్తున్నారు. అయితే ఈ ప్ర‌మాదం విష‌యంలో అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఈ అగ్నిప్రమాదం జరిగింది ఇప్ప‌టికే పూర్తయిన ఆచార్య సినిమా సెట్ లో. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటించిన ఆచార్య చిత్రం గత ఏడాది విడుదలై డిజాస్టర్ కాగా, ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు.

ఆచార్య చిత్రం కోసం గతంలో హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద భారీ సెట్ నిర్మించిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద భారీ ఖర్చుతో ధర్మస్థలి పేరుతో టెంపుల్‌ సెట్ రూపొందించారు. ఇప్పుడీ సెట్‌ మొత్తం కాలిపోయింది.

ప్రైవేట్ ఫామ్ హౌజ్‌లో రూపొందించ‌డం వ‌ల‌న సెట్‌ని అలానే ఉంచారు. అయితే ఓ వ్యక్తి ఈ సెట్ బయట కూర్చొని సిగరెట్ కాల్చి పారేయడంతో వ‌ల‌న సెట్ మొత్తం బుగ్గిపాలైనట్లు తెలుస్తోంది.

ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో అప్పట్లో దీన్ని రెడీ చేయ‌గా, దీని కోసం దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

also read :

-Advertisement-

Extramarital Affair : ప్రియురాలికి వీడియో కాల్‌ చేసి మరీ తండ్రిపై దాడి..

Alia Bhatt at Zee Cine Awards 2023 Photos and Videos

Rashmika Mandanna hot at Zee Cine Awards 2023 Photos and Videos

walnuts for kids : పిల్లల చదువులపై ఒత్తిడి ఉందా? ఈ నట్స్ ట్రై చేయండి!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News