Fennel Seeds Benefits : మనకు అందుబాటులో ఉండే వాటిని క్రమం తప్పకుండా తింటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే కొందరు వాటిని పట్టించుకోవడం మానేశారు. భోజనం తర్వాత ఒకప్పుడు ప్రతి ఒక్కరు సోంపు గింజలు తినేవారు. అలా చేయడం వలన జీర్ణ సమస్యలే వచ్చేవి కావు.
సోంపు గింజల్లో మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకం. ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా లభిస్తాయి.సోంపు గింజల్లో ఉండే మాంగనీస్ శరీర మెటబాలిజంను క్రమబద్దీకరిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ కావడమే కాక, గాయాలు కూడా త్వరగా మనుతాయి.
సోంపుతో చాలా ప్రయోజనాలు..
సోంపు గింజల్లో యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. ఆకలిని నియంత్రించే గుణాలు కూడా సోంపు గింజల్లో ఉంటాయి. ఆకలి ఎక్కువగా అవుతుందని అనుకునే వారు సోంపు గింజలను తిని చూస్తే ఫలితం తప్పక కనిపిస్తుంది. సోంపు గింజలతో బరువు కూడా తగ్గవచ్చు. సోంపు గింజలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని పరిశోధనలో తేలింది. వీటిలో ఉండే ఫైబర్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను చాలా వరకు నియంత్రిస్తుందట.
సోంపు గింజల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయంటున్నారు. సోంపు గింజల్లో క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు కూడా ఉంటాయని వెల్లడైంది. పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే పాలు పుష్కలంగా వస్తాయట. డాక్టర్ ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవడం మంచింది. సోంపు గింజలతో మల బద్ధకం సమస్య ఏర్పడదు. గ్యాస్, అసిడిటీ కూడా రాకుండా ఉంటాయి. అందుకే తప్పక సోంపు మీ ఆహారపు అలవాట్లలో భాగం చేసుకోండి.