వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐతో మహిళా ఎస్ఐ ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. పెళ్లయి నెల రోజులు కూడా గడవక ముందే అంతకు ముందు పరిచయం ఉన్న ఇన్స్పెక్టర్తో మహిళా ఎస్ఐ హద్దులు మీరి ప్రవర్తిస్తుండడంతో పోలీసు శాఖకు తలవంపులు తెచ్చిపెట్టింది. వీరి పరిస్థితిపై అనుమానం వచ్చిన మహిళా ఎస్ఐ భర్త.. నేరుగా కమిషనర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో వీరి వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, దామెర సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రియ కలిసి చెట్టపట్టాలేసుకొని తిరిగారు. పెళ్లయిన నెల రోజులకే ఇదంతా సాగడంతో హరిప్రియ భర్తకు అనుమానం వచ్చింది. సెల్ఫోన్లో వాట్సాప్ సందేశాలు పరిశీలించిన ఆమెభర్త.. ఇన్స్పెక్టర్తో ప్రేమాయణం సాగుతోందని నిర్ధారణకు వచ్చాడు. దీంతో వెంటనే వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్‌ను ఆశ్రయించాడు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఘటనపై స్పందించిన సీపీ రంగనాథ్.. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చర్యలకు ముందు దీనిపై నివేదిక తెప్పించుకున్న సీపీ.. ఆధారాలు నిజమని తేల్చడంతో ఈ మేరకు కఠినచర్యలకు ఉపక్రమించారు. దీంతో కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది.
యువతి ఫిర్యాదుపై పట్టించుకోని ఎస్ఐ..
ఇక ఇదే కమిషనరేట్ పరిధిలో మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతిని మరో ఎస్ఐ .. పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించాడు. పైగా రాజీ పడాలంటూ ఎస్ఐ పున్నం చందర్ ఉచిత సలహా ఇచ్చాడు. బాధిత యువతి కమిషనర్‌కు కంప్లైట్ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ రంగనాథ్.. ఘటనపై నివేదిక తెప్పించుకున్నారు. అనంతరం ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా కమిషనరేట్ పరిధిలో వరుసగా నెల రోజుల్లోనే పలు ఘటనల్లో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో కమిషనరేట్ పరిధిలో ఇక ఏమి జరిగినా కఠిన చర్యలు తప్పవన్న సంకేతాన్ని సీపీ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించే పోలీసుల్లో భయం పట్టుకుంది.
also read:
Rashmika: సమంత ఆరోగ్యం గురించి స్పందించిన రష్మిక.. ఎమోషనల్ అవుతూ స్టన్నింగ్ కామెంట్
Pakistan Crisis : పాక్‌కు అప్పుల కష్టాలు.. విద్యుత్ ఆదా కోసం వినూత్న నిర్ణయాలు!
Rakul Preet Singh Latest Hot Photos | Rakul Instagram Pics
సర్వరోగ నివారిణి గోధుమగడ్డి (WheatGrass) ఉపయోగాలు తెలుసుకోండి