Elon Musk wants to develop TruthGPT : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఛాట్ జీపీటీ (chat GPT) తన సత్తా చాటుతోంది. గూగుల్‌కు పోటీగా ఛాట్ జీపీటీ దూసుకెళ్తోంది. అణ్వాయుధాల కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరమైందని ఐదేళ్ల కిందట ఎలన్‌మస్క్ (ELON MUSK) విమర్శలు చేశారు.
ప్రస్తుతం ఛాట్ జీపీటీకి పోటీగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు ఎలన్ మస్క్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చాట్ జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణతో మస్క్ కూడా ఏఐ బాటపట్టారు. ఏఐ చాట్ బోట్‍ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ట్రూత్ జీపీటీ (TruthGPT) అనే కొత్త ఏఐని త్వరలోనే తీసుకురానున్నట్లు ఎలన్ మస్క్ పేర్కొన్నారు.
ఈ విషయాన్ని మస్క్ సోమవారం ప్రసారమైన ఫాక్స్ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో వివరించారు. ట్రూత్ జీపీటీ అత్యుత్తమ భద్రత కల్పించడంతో పాటు మానవ వనరులకు ఎలాంటి ప్రమాదాన్ని హాని తలపెట్టదని మస్క్ చెప్పారు. దీన్ని ప్రారంభించడం కాస్త ఆలస్యం కావచ్చు గానీ థర్డ్ పార్టీ ఒపీనియన్‌ను కూడా తప్పకుండా తీసుకుంటానన్నారు.
ఇక మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాట్ జీపీటీపై ఎలాన్ మస్క్ అనేక విమర్శలు గుప్పించారు. అబద్దాలు చెప్పేందుకు ఏఐకి శిక్షణ ఇస్తున్నారని మండిపడ్డారు. ఓపెన్ సోర్సుగా ప్రారంభమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లోజ్ సోర్సుగా మారుతోందని మండిపడ్డారు.
ALSO READ :
Ram Charan: ఐపీఎల్‌లో మెగా ఎంట్రీ.. ఇక క్రికెట్‌లోను రచ్చ చేయబోతున్న రామ్ చరణ్..!
Mrunal Thakur Super Hot Stills, Images, Photos 2023