Homeviral newsViral Video: ఏనుగు పానీపూరీని భ‌లేగా ఆర‌గించేస్తుందిగా...!

Viral Video: ఏనుగు పానీపూరీని భ‌లేగా ఆర‌గించేస్తుందిగా…!

Telugu Flash News

Viral Video: ఇటీవ‌లి కాలంలో చాలా మంది పానీపూరీపై మ‌క్కువ ఎక్కువ చూపిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా పానీపూరీని ఇష్టంగా తింటున్నారు. రోడ్ సైడ్ ప‌క్క‌న బండిపై పానీపూరీ తింటే ఆ రుచే వేర‌ప్పా అనేలా ఉంటుంది. అయితే ఇన్నాళ్లు పానీపూరీని మ‌నుషులు ఇష్టంగా తిన‌డం మ‌నం చూశాం. కాని ఇప్పుడు జంతువులు సైతం పానీపూరిని లాగించేస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు పానీపూరిని ఎంచ‌క్కా ఆర‌గిస్తుండ‌డంతో చుట్టు ప‌క్క‌ల వారు ఆశ్చ‌ర్యంగా చూస్తున్నారు. తాజాగా ఏనుగుకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

గుటుక్కున మింగేసింది..

ఈ వీడియోలో ఏనుగు పానీపూరీ బండి పక్కన నిలబడి త‌న తొండంతో పానీపూరీలను గుటుక్కున మింగేస్తుంది.ఇక‌ పానీపూరీ అమ్మే వ్యక్తి… ఏనుగుకి పానీపూరీలు ఇస్తూనే ఉన్నాడు ఈ సన్నివేశం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. చాలా మంది జనం అక్కడికి చేరి ఎంతో ఆనందంగా చూస్తున్నారు. చాలామంది ఈ అరుదైన సన్నివేశాన్ని చూసి తమ మొబైళ్లలో రికార్డు చేసారు. ఈ వీడియోని చూసి చాలా మంది ఆశ్చర్యపోగా,. ఏనుగు చక్కగా పానీపూరీని ఆస్వాదిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఒక యూజర్ అయితే తన పానీపూరీ కూడా ఏనుగుకి ఇవ్వమని కామెంట్ చేసాడు. మరొక యూజర్ ”కేవలం మనుషులకేనా ఆనందం నేను కూడా పానీపూరిని ఎంజాయ్ చేస్తాను” అని ఏనుగు చెప్పినట్లుగా త‌న కామెంట్ సెక్ష‌న్స్‌లో రాసుకొచ్చాడు. మ‌రో సోష‌ల్ మీడియా యూజ‌ర్.. ”భారతదేశంలో ఎలుక నుంచి ఏనుగు వరకు మనం జంతువులని పూజిస్తాం.. ప్రేమగా చూసుకుంటాం.. పులి, మనిషితో తిరగగలదు. మార్కెట్లో ఏనుగు పానీపూరీని తినగలదు. ఎలుకలు ఆలయాల్లో పాలు తాగగలవు. ఇలా జంతువులని ప్రేమగా చూసుకోవడం మన సంప్ర‌దాయం అంటూ కామెంట్ చేశాడు. ఏదేమైన ఏనుగు ఇలా పానీపూరి తిన‌డం మాత్రం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News