Viral Video: ఫైటింగ్ అనేది సాధారణంగా మనుషుల మధ్య ఎక్కువగా చూస్తుంటాం. చిన్న చిన్న కారణాలకు తన్నుకోవడం, కొట్టుకోవడం ఈ మధ్య సాధారణంగా మారాయి. మరి కొందరు అయితే చంపుకుంటున్నారు కూడా. మనుషులు రోజురోజుకి రాక్షసులుగా మారుతున్నారు. అయితే వీరి ప్రభావం జంతువులపై కూడా పడుతుందో ఏమో కాని ఎప్పుడు కొట్టుకోని జంతువులు కూడా ఇప్పుడు ఫైటింగ్‌లు చేస్తున్నాయి. అవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తాజాగా రెండు జింకలు ఫైట్ చేస్తున్నాయి. సాధారణ రీతితో కొమ్ములతో కొట్టుకోవడం కాకుండా.. బాక్సింగ్ ఛాంపియన్స్ మాదిరి పంచ్‌లు విసురుకోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
జింకల్ పంచ్..
బాక్సింగ్ ఛాంపియన్స్ మాదిరిగా రెండు కాళ్లతో నిలబడి.. ముందరి కాళ్లతో ఒకదానిపై ఒకటి పంచుల వర్షం కురిపించుకుంటున్న నేపథ్యంలో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ వీడియోను ఇప్పటికే 80 వేల మంది చూశారు. చాలా మంది షేర్ చేశారు. కామెంట్లు కూడా చేస్తున్నారు.
రొనాల్డొ అండ్ మెస్సీ ఫైట్ లా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పలువురు పలు రకాలుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతనంద షేర్ చేసిన ఈ వీడియోలో.. రెండు ఆడ జింకలు, రెండు మగ జింక మైదాన ప్రాంతంలో హాయిగా మేత మేస్తుండగా, ఈ ఫైటింగ్ జరిగింది.
ఇది చూసి జనాలే కాదు జింకలు కూడా ఇలా కొట్లాడుతాయా అనే సందేహాం అందరిలో కలిగింది. చాలా మంది వివిధ రకాలుగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి జింకల ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో రచ్చ చేస్తుండగా.. నెటిజన్లు దానిని చూసి ఫిదా అయిపోతున్నారు
Deer boxing pic.twitter.com/15pzsmGPGd
— Susanta Nanda IFS (@susantananda3) September 19, 2022