Orange benefits : నేటి కాలంలో ఒత్తిడి, ఆందోళన విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ రంగంలోనైనా ఇది సర్వ సాధారణం అయిపోయింది. ఒత్తిడిని తగ్గించుకొనేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వేసవిలో తాజా పండ్లు తినడం వల్ల కొంత మేర ఒత్తిడి తగ్గుతుంది.
1. తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే నారింజను తింటే వెంటనే మానసిక స్థితి మారుతుందని, ఆందోళన తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
2. నారింజ పండ్లను తింటే సహజంగానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3. నారింజలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కణాల పునరుత్పత్తిని మెరుగుపరుస్తాయి.
4. జలుబు, ఫ్లూ వంటి రోగాలకు వ్యతిరేకంగా పని చేయడంలో నారింజ ఫ్రూట్ దోహదం చేస్తుంది.
5. నారింజలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
6. నారింజ పండులోని పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
7. ఒత్తిడి స్థిరంగా కలగడం వల్ల, ఆందోళన రావడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. వీటిని తగ్గించుకోవాలంటే రోజూ నారింజ పండు తినాలని సూచిస్తున్నారు.
Also read news :
Viral Video : సింహాన్నే ఫూల్ చేశాడు.. బొమ్మలా నిలబడి ఏం చేశాడో చూడండి!
Manchu Family : రోడ్డున పడ్డ మంచు ఫ్యామిలీ గొడవ.. స్పందించిన మంచు విష్ణు