Homehealthచలికాలంలో జామ పండ్ల‌ను అస్సలు మిస్సవ్వకండి.. ఈ 6 ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి!

చలికాలంలో జామ పండ్ల‌ను అస్సలు మిస్సవ్వకండి.. ఈ 6 ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి!

Telugu Flash News

పేదవాడి యాపిల్..జామ పండు!! చౌక ధరల్లో , అన్ని సీజన్లలో దొరకడం దీని ప్రత్యేకత. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లు, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. క్యాలరీలు తక్కువ ఉండే ఆహారం ఇది. మార్కెట్లో రెండు రకాల జామపండ్లు ఉంటాయి. కొన్ని లోపల తెల్లగా ఉంటే మరికొన్ని ఎర్రగా ఉంటాయి. ఇవి రెండూ మంచివే.

1. షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు..

దీన్ని పరిమితంగా తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు, రక్తపోటు రోగులకు చాలా మంచిది. జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జామ పండులో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఆకలి తక్కువ కావడం తో పాటు కడుపు నిండిన తృప్తి కలుగుతుంది.

2. జీర్ణవ్యవస్థ క్లియర్

శరీరంలోని కొవ్వుని కరిగించడంలో జామ పండు ముఖ్య పాత్ర పోషిస్తుంది.హృద్రోగులు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా వీటిని తినొచ్చు. జామపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థని క్లియర్ అవుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దానివల్ల జీర్ణవ్యవస్థ, పేగులు ఆరోగ్యంగా తయారవుతాయి. మలబద్ధక సమస్యని కూడా జామ నివారిస్తుంది.

3. ఇమ్యూనిటీ బూస్టర్

జామ పండులో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఇది తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జామపండు క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేసుకోవచ్చు.

4. స్ట్రెస్ బస్టర్..

జామపండ్లలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఒత్తిడిని అధగమించడానికి జామ పండు తినడం మంచి మార్గం. జామ పండు రోజు తినడం వల్ల మనసు హాయి గా అనిపిస్తుంది.

5. బ్లడ్ కొలెస్ట్రాల్ డౌన్..

జామకాయ జ్యూస్ లివర్ కి మంచిగా పని చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. చర్మ సౌందర్యానికి కొల్లాజెన్ ఉత్పత్తి చాలా అవసరం. కొల్లజెన్ ఉత్పత్తికి కారణమయ్యే పెక్టిన్ జామకాయ లో దొరుకుతుంది. ఇది పేగుల్లోని ప్రోటీన్ ను కూడా కాపాడుతుంది.  గర్భిణులు జామకాయను తింటే మేలు జరుగుతుంది. కడుపు లో బిడ్డ ఎదగడానికి కావాల్సిన విటమిన్ బి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా దొరుకుతాయి.

-Advertisement-

6. వెయిట్ లాస్ కోసం..

బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి జామకాయ అద్భుతమైన పండు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్, మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన తృప్తి కలుగుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల  బరువు కూడా అదుపులో ఉంటుంది.

also read this news :

అమెరికా మధ్యంతర ఎన్నికలలో బైడెన్ కు షాక్ ! లీడ్ లో కొనసాగుతున్న ట్రంప్ పార్టీ .. బైడెన్ అధ్యక్ష పదవి కోల్పోతారా ?

గ్రీన్ టిక్ ఫ్రీగా ఇస్తాం రండి.. కొత్త యూజర్స్ కోసం Koo అన్వేషణ!!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News