benefits of eating grapes in summer : వేసవి కాలం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. మండే ఎండల్లో చర్మాన్ని కాపాడుకోవడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సూర్యకిరణాలు నేరుగా చర్మంపై తీవ్రస్థాయిలో తాకితే వివిధ రకాల వ్యాధులకు కారణం కావచ్చు. ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
1. ద్రాక్ష పండ్లను తినడం వల్ల చర్మానికి ఎంతో మంచిది. సూర్య కాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడినప్పుడు, వాటిని తట్టుకునే శక్తిని ద్రాక్ష చర్మానికి ఇస్తుంది. ఈ విషయం ఇప్పటికే అనేక పరిశోధనల్లో కూడా తేలింది.
2. ద్రాక్ష పండ్లలో ఫైటో కెమికల్స్, రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది చర్మానికి హాని కలగకుండా రక్షణ పొరలా ఉంటుంది. వేసవికాలంలో చర్మం కోసం ప్రత్యేకంగా ద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
also read :
Vedanta: అప్పుల ఊబిలో వేదాంత.. అదానీ బాటలో ప్రయాణం ఖాయమా?
YS Jagan : 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా? చంద్రబాబు, పవన్‌కు జగన్ సవాల్..!
Sunny Leone Latest Photos, Stills, images 2023