HomeSpecial StoriesDwayne The Rock Johnson : హాలీవుడ్‌ స్టార్‌ హీరో ది రాక్‌ డ్వైన్‌ జాన్సన్‌ గురించి తెలుసుకోండి.. రియల్ లైఫ్ స్టోరీ

Dwayne The Rock Johnson : హాలీవుడ్‌ స్టార్‌ హీరో ది రాక్‌ డ్వైన్‌ జాన్సన్‌ గురించి తెలుసుకోండి.. రియల్ లైఫ్ స్టోరీ

Telugu Flash News

రెజ్లింగ్ లో ఎనలేని అభిమానాన్ని పొంది, కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో రాక్ డ్వేయన్ జాన్సన్ (Dwayne The Rock Johnson) కూడా ఒకరు. అలాంటి గొప్ప సంకల్పం,మంచి మనసు ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

1972, మే 2న కాలిఫోర్నియాలో ఫార్మర్ రెజ్లర్ అయిన రాకీ జాన్సన్ కి జన్మించిన రాక్ డ్వేయన్ జాన్సన్ చిన్నపాటి నుంచి చదువులో అంత శ్రద్ధ చూపక పోయినప్పటికీ రగ్బీ లాంటి ఆటలలో ఎక్కువ ఆసక్తి చూపే వాడట.

రాక్ తండ్రి ఒక లెజెండరీ రెజ్లర్ అయినప్పటికీ ఒకో సమయంలో చేతులలో చిల్లి గవ్వ లేక పూట గడవడానికి కూడా కష్టంగా ఉండేదట.

ఇలా పేదరికం, తను పెరిగిన వాతావరణం తన మానసిక స్థితి పై ప్రభావం చూపడంతో చెడు మార్గం వైపు అడుగులు వేసిన రాక్ 17 ఏళ్లకే దొంగతనం, గొడవలు, చెక్ ఫ్రాడ్ లాంటి వివిధ రకాల నేరాలకు పాల్పడి అరెస్ట్ కు గురైయ్యాడు.

తన జీవితం నేరాలకు,బాధలకు కొలువైన చీకటి వైపు అడుగులు వేస్తున్న సమయంలో రాక్ చదువుతున్న ఫ్రీడమ్ హై స్కూల్ ఫుట్‌బాల్ కోచ్ అయిన జోడీ తన సహాయానికి వచ్చాడు.

రాక్ ను స్కూల్ ఫుట్‌బాల్ జట్టులో చేర్చి తన మనో వికాసానికి ఇక ముందు రాబోతున్న జీవిత విజయాలకు తలుపులు తెరిచాడు.

-Advertisement-

1991లో మియామీ హరికేన్స్ లో జరిగిన నేషనల్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో  గెలవడంతో పాటు తన ప్రతిభను చూపి అందరి ప్రశంసలను పొందాడు.

ఆ సమయంలోనే రెజ్లింగ్ వైపు కూడా ఆసక్తి ఉండడంతో తొలి సారిగా రాక్ అటువైపుగా అడుగులు వేసి ఒక కొత్త జీవితానికి తెర తీశాడు.

రెజ్లింగ్ జర్నీ:

1996, నవంబర్ 4న తొలి సారిగా W.W.E లో అడుగు పెట్టిన రాక్ అదే నెలలో 17న జరిగిన సర్వైవర్ సీరియస్ ద్వారా రెజ్లింగ్ రింగ్ లోకి  అడుగు పెట్టి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

తన రెజ్లింగ్ జీవితంలో 10 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా,2 సార్లు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గా మరియు 5 సార్లు టాగ్ టీం ఛాంపియన్ గా నిలిచి అందరి అభిమానాన్ని పొందిన రాక్ 2000 రాయల్ రంబుల్ విజేతగా,ఆరు సార్లు W.W.E ట్రిపుల్ క్రౌన్ ఛాంపియన్ గెలిచి అందర్నీ ఆశ్చర్య పోయేలా చేసాడు.

సినీ ప్రయాణం:

Dwayne The Rock Johnson in movies2001 లో విడుదలైన ది మమ్మీ రిటర్న్స్ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన రాక్ 2002లో విడుదలైన ది స్కార్పియన్ కింగ్ లో నటిస్తూ ఆ సమయంలో అత్యధిక రెమ్యునిరేషన్ తీసుకున్న నటుడిగా అందర్నీ అవాక్కయేలా చేసాడు.

2011 లో తన పూర్తి ఆసక్తిని సినిమాల పై పెట్టిన రాక్ జి.ఐ జో రిటాలియేషన్, జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్, స్కైస్క్రాపర్,రాంపేజ్,ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7,ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఆఫ్ ది ఫేట్,జుమంజి : వెల్కమ్ టు ది జంగిల్, జుమంజీ: ది నెక్స్ట్ లెవెల్ లాంటి ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించి వారి ఆదరణను పొందాడు.

ఇప్పటికీ కొత్త కొత్త కథలను,పాత్రలను ఎంచుకుంటూ అందర్నీ తన సినిమాలతో అలరిస్తున్న రాక్ ఇక ముందు ఎలాంటి సినిమాలు తీస్తాడో,ఇంకెన్ని అద్బుతాలు సృష్టిస్తాడో చూడాలి మరి.

also read news:

Anupama Parameswaran photos at 18 Pages Movie Pre Release Event

Kidney Stones : కిడ్నీలో రాళ్లు.. ఎలా తెలుసుకోవాలి? సంకేతాలివే..! ఆలస్యం చేయకండి..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News