HomecinemaSita Ramam: క్లాసిక‌ల్ హిట్ సీతారామంకి సీక్వెల్ ఉంటుందా.. దుల్క‌ర్ ఏమన్నాడు..!

Sita Ramam: క్లాసిక‌ల్ హిట్ సీతారామంకి సీక్వెల్ ఉంటుందా.. దుల్క‌ర్ ఏమన్నాడు..!

Telugu Flash News

Sita Ramam: ఈ మ‌ధ్య కాలంలో సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువైంది. ఒక సినిమా హిట్ అయిందంటే దానికి వెంట‌నే సీక్వెల్స్ మొద‌లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో సీతారామం సీక్వెల్ ఉంటుంద‌నే దానిపై కొద్ది రోజులుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో దుల్క‌ర్ స‌ల్మాన్ క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల విడుదలై ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలిచిన సినిమా సీతారామం. ఈ సినిమా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇకపోతే డైరెక్టర్ హానురాఘవపూడి తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు కురిపించారు.

సీతారామం సినిమా తెలుగు .. తమిళ్ ఆడియన్స్ మదిని తాకింది. ఈమూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నా.. ఇప్పటికి పలుచోట్ల ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్న వైనం చూస్తే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అర్ధం అవుతుంది.

చిత్రం భారీ సక్సెస్ న‌మోదు చేసుకున్న నేప‌థ్యంలో రీసెంట్‌గా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ క్ర‌మంలో సీక్వెల్ చేసే అంశంపై మీడియా ప్రతినిధి ఒకరు చిత్ర హీరో దుల్కర్ సల్మాన్ ను ప్రశ్నించ‌గా,. దీనికి ఆయన ఆసక్తికర రీతిలో సమాధాన్ని ఇచ్చారు.

హిట్ అయిన సినిమా ప్రేక్షకుల మదిలో క్లాసిక్ గా నిలిస్తే.. దాన్ని మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని తాను నటుడిని కాక ముందే తెలుసుకున్నాన‌ని దుల్క‌ర్ అన్నాడు. క‌థ‌ను బాగా న‌మ్మి సినిమా తీసాం అన్న దుల్క‌ర్.. ఈ చిత్రం క్లాసిక్గా నిలుస్తుంద‌ని అప్పుడే అనుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ క్లాసిక్ మూవీకి కొనసాగింపు ఉండదనే అనుకుంటున్నా అని గ‌త కొద్ది రోజుల‌గా వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టారు. సెప్టెంబర్ 9న ఓటీటీలో విడుదలైన ఈ మూవీ దూసుకుపోతుంది. ఇందులోని పలు సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు నెటిజ‌న్స్..

-Advertisement-

మరిన్ని వార్తలు చదవండి :

Ariyana Glory: టైట్ డ్రెస్‌లో తెగ టెంప్ట్ చేస్తున్న అరియానా.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు

rashmika mandanna : ర‌ష్మిక హిందీ మాట్లాడ‌డం ఎప్పుడైన చూశారా.. ఎంత ముద్దుగా మాట్లాడిందో తెలుసా?

bigg boss telugu season 6 : బిగ్ బాస్ శ్రీస‌త్య‌పై పెరుగుతున్న నెగెటివిటీ.. అందంతో కాదు ఆట‌తో మెప్పించు..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News