HomesportsDravid: విరాట్‌, రోహిత్‌ల‌ని టీ20ల నుండి త‌ప్పించార‌నే ప్ర‌చారాలు.. క్లారిటీ ఇచ్చిన ద్ర‌విడ్

Dravid: విరాట్‌, రోహిత్‌ల‌ని టీ20ల నుండి త‌ప్పించార‌నే ప్ర‌చారాలు.. క్లారిటీ ఇచ్చిన ద్ర‌విడ్

Telugu Flash News

Dravid: కొత్త ఏడాది లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకొని భ‌ళా అనిపించింది. ఇక చివరిదైన నామమాత్రపు వన్డే నేడు జ‌ర‌గ‌నుండ‌గా, ఇండోర్ వేదికగా జ‌రిగే ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంటే.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని న్యూజిలాండ్ క‌సితో ఉంది. అయితే శ్రీలంకతో టీ20 సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీలను దూరం పెట్టడంతో ఈ సీనియర్ ఆటగాళ్ల‌ను టీ20 ఫార్మాట్‌ నుంచి పక్కనపెడుతున్నారే ప్రచారం ఇటీవ‌ల ఊపందుకుంది.

ఈ క్ర‌మంలో ద్ర‌విడ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాది జరగనున్న కీలక టోర్నీల నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను టీ20లకు దూరం పెట్టామని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు వన్డే ప్రపంచకప్, ఆసియాకప్, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి ప్రధాన టోర్నీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ టోర్నీలకు రోహిత్, కోహ్లీలను ఫ్రెష్‌గా ఉంచాలనే టీ20 ఫార్మాట్‌లకు దూరంగా ఉంచుతున్నామని ద్ర‌విడ్ అన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అండర్ -19 ప్లేయర్‌గా ఉన్నప్పటి నుంచి రోహిత్ శర్మను చూస్తున్నానని చెప్పిన ద్రవిడ్..కెప్టెన్‌గా అతను ఎదిగిన తీరు అద్భుతమంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు.

గత 15 ఏళ్లుగా అసాధారణమైన ఆటతోఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు రోహిత్ . అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ మాత్రం ఓపెనర్‌గా బరిలోకి దిగడం. అక్కడి నుంచి రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో అతను రాణించిన తీరు అమోఘం. 2019 వన్డే ప్రపంచకప్‌లో అతను ఆడిన తీరు.. వన్డే క్రికెట్‌లో అతను సాధించిన మూడు డబుల్ సెంచరీలు అమోఘమైన ఘనతలు. రోహిత్ శర్మ 17-18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి చూసినట్లు గుర్తుంది. అప్పుడే అండర్ -19 క్రికెట్ నుంచి వచ్చాడు. అయితే అతనిలో అన్ని నైపుణ్యాలున్నాయి. పూర్తి స్థాయి బ్యాటర్ అతను. రోహిత్ జట్టును నడిపిస్తున్న తీరును చూడటం గొప్పగా ఉంది.’అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News