dogs attack in hyderabad : హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన కుక్కల దాడి ఘటనపై హైకోర్టు స్పందించింది. అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో బాలుడు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. నష్టపరిహారం చెల్లింపు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.
కుక్కల దాడి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈ కేసు విచారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నలు గుప్పించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. గత ఆదివారం అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల పిల్లాడు మృత్యువాత పడిన విషయం నగరవాసులను బెంబేలెత్తించింది.
ఈ వ్యవహారంలో పలు పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తోంది. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అంబర్‌పేటలో ఉంటున్నాడు. అంబర్‌పేటలోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తూ జీవితం గడుపుతున్నాడు. గత ఆదివారం గంగాధర్ తన ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌తో పాటు తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్‌కు చేరుకున్నారు. కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపల ఉంచి తాను చేసుకోసాగాడు.
ఈ నేథప్యంలోనే ప్రదీప్ అలా ఆడుకుంటూ అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సుమారు ఆరు కుక్కలు బాలుడిపై అటాక్ చేశాయి. ఇది కాస్త ఆలస్యంగా గమనించిన తండ్రి.. అక్కడికి వచ్చేలోపే పిల్లవాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కడుపు, తల, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ పిల్లాడు వీధికుక్కల కాటుకు బలైపోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
also read :
Rakul Preet Singh : షాకిచ్చిన రకుల్.. నవంబర్‌లోనే పెళ్లి అయిందంటూ ఆశ్చర్యకర కామెంట్స్