Sakshi Malik News : బీజేపీ ఎంపీ, ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భారత మహిళా రెజ్లర్లు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
భారత స్టార్ మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ తదితరులు ఆ నిరసనలో పాల్గొంటున్నారు. కాగా, మహిళా రెజ్లర్ల ఆందోళనలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
నిన్నటి వరకు ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపారని , తన రైల్వే ఉద్యోగానికి తిరిగి వస్తానని ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. కాగా, రెండు రోజుల క్రితం బ్రిజ్ భూషణ్ కేసుపై చర్చించేందుకు సాక్షి మాలిక్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
ఈ భేటీ జరిగిన రెండు రోజులకే సాక్షి మాలిక్ రెజ్లర్ల ఆందోళన నుంచి వైదొలగడంపై వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. బ్రిజ్ భూషణ్ అరెస్టుకు ఈ నెల 9వ తేదీ వరకు కేంద్రానికి రెజ్లర్లు డెడ్ లైన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి అరెస్టు చేయకుంటే గంగా నదిలో పతకాలను విసిరేస్తామన్నారు.
అయితే రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలను సాక్షి మాలిక్ ఈ రోజు సోమవారం ఖండించారు. ఈ వార్త పూర్తిగా తప్పు. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేమేమీ వెనక్కు తగ్గలేదు . నిరసన తో పాటు రైల్వేలో నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు.
ये खबर बिलकुल ग़लत है। इंसाफ़ की लड़ाई में ना हम में से कोई पीछे हटा है, ना हटेगा। सत्याग्रह के साथ साथ रेलवे में अपनी ज़िम्मेदारी को साथ निभा रही हूँ। इंसाफ़ मिलने तक हमारी लड़ाई जारी है। कृपया कोई ग़लत खबर ना चलाई जाए। pic.twitter.com/FWYhnqlinC
— Sakshee Malikkh (@SakshiMalik) June 5, 2023
read more news :
Manasa : పెట్రోల్ పోసుకుని బీడీఎస్ విద్యార్థిని మానస ఆత్మహత్య
Anasuya : డియర్ నిక్కూ.. భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన అనసూయ..